Business Ideas: కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు.. లక్షల్లో లాభం!
ఈ సమ్మర్ సీజన్‌లో బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. అతి తక్కువ పెట్టుబడితో నెలనెలా భారీగా లాభాలు పొందే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మీరు అతి తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తే మీకు మంచి రాబడి అవస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాల గురించి తెలుసుకుందాం..

Business Idea
Summer Business Ideas: రూ. 50 వేల బడ్జెట్ అనేది సమ్మర్ బిజినెస్ ప్రారంభించడానికి చాలా మంచి మొత్తం. ఈ పెట్టుబడితో మీరు సొంతంగా మెషీన్ కొనుక్కోవచ్చు లేదా మంచి స్టాక్ పెట్టుకోవచ్చు. 50 వేల లోపు చేయగలిగే టాప్ 5 బిజినెస్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. మీరు సరిగ్గా సమయాన్ని కేటాయించి ఈ బిజినెస్‌లతో లక్షల్లో లాభం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: New Bajaj Pulsar: బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. ఇక అది ఉండదు!
- చెరకు రసం వ్యాపారం (Sugarcane Juice): వేసవిలో అత్యధిక లాభం ఇచ్చే బిజినెస్ ఇది. ఒక చిన్న ‘టేబుల్ టాప్’ లేదా ‘పోర్టబుల్’ ఆటోమేటిక్ చెరకు రసం మెషీన్ ధర రూ. 30,000 నుండి రూ. 45,000 మధ్యలో ఉంటుంది. లాభం: ఒక గ్లాసు రసం తయారు చేయడానికి రూ. 5-7 ఖర్చయితే, దానిని రూ. 20-25 కి అమ్మవచ్చు. రద్దీగా ఉండే సెంటర్లో పెడితే నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం వల్ల మంచి లాభం పొందవచ్చు.
- సోడా, సాఫ్ట్ డ్రింక్స్ (Soda Hub): చిన్నపాటి సోడా మేకింగ్ మెషీన్ లేదా గ్యాస్ సిలిండర్ సెటప్‌తో దీనిని ప్రారంభించవచ్చు. పెట్టుబడి: ఒక చిన్న 2 లేదా 3 ఫ్లేవర్ల సోడా మెషీన్ సుమారు రూ. 40,000 లోపు దొరుకుతుంది. ప్రత్యేకత: నిమ్మ సోడా, మసాలా సోడా, అల్లం సోడా వంటి వెరైటీలు పెడితే యువత ఎక్కువగా ఇష్టపడతారు.
- ఐస్ క్రీమ్ పార్లర్ (చిన్నపాటి స్టాల్): పెద్ద బ్రాండ్ల ఫ్రాంచైజీలు కాకుండా లోకల్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తీసుకోవచ్చు. పెట్టుబడి: ఒక సెకండ్ హ్యాండ్ డీప్ ఫ్రీజర్ (Deep Freezer) రూ. 15,000కి దొరుకుతుంది. మిగిలిన రూ.35,000 తో స్టాక్, బ్రాండింగ్ చేసుకోవచ్చు. దీంతో మీరు అదనపు ఆదాయం పొందవచ్చు. ఐస్ క్రీమ్ తో పాటు కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ కూడా అమ్మవచ్చు.
- ఆర్గానిక్ సమ్మర్ డ్రింక్స్ (రాగి అంబలి, మజ్జిగ): ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే రోడ్ల పక్కన రాగి అంబలి, చల్లటి మజ్జిగ స్టాల్స్ కి క్రేజ్ పెరుగుతోంది. పెట్టుబడి: దీనికి పెద్దగా మెషీన్లు అక్కర్లేదు. కేవలం పెద్ద మట్టి కుండలు, మంచి టేబుల్ సెటప్, ముడి పదార్థాల కోసం రూ.10,000 – 15,000 సరిపోతుంది. ఇక లాభం విషయానికొస్తే.. ఖర్చు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, వచ్చే ఆదాయంలో 60-70% లాభమే ఉంటుంది.
- పండ్ల వ్యాపారం (Seasonal Fruits): ముఖ్యంగా పుచ్చకాయలు (Watermelons) లేదా తాటి ముంజల వ్యాపారం. పెట్టుబడి: ఒకేసారి రూ. 20,000 – 30,000 పెట్టి తోటల దగ్గర లేదా హోల్ సేల్ మార్కెట్ లో ఒక లోడ్ పుచ్చకాయలు కొని అమ్మవచ్చు. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనికి షాపు కూడా అక్కర్లేదు. ఒక తోపుడు బండి లేదా ఖాళీ స్థలం ఉంటే సరిపోతుంది. ఇందులో ఏది ఎంచుకోవాలి?: మీకు కష్టపడే ఓపిక ఉండి, కస్టమర్లతో మాట్లాడగలిగితే చెరకు రసం లేదా సోడా బిజినెస్ బెస్ట్. తక్కువ రిస్క్ అనుకుంటే పండ్ల వ్యాపారం లేదా మజ్జిగ స్టాల్ ఉత్తమం.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: చమురు మంటలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.రూ.450, డీజిల్ రూ.500 దాటేసింది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us




