AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు

Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు

Phani CH
|

Updated on: Apr 03, 2026 | 3:38 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'పెద్ది' సినిమా విడుదల తేదీపై నెలకొన్న గందరగోళానికి చరణ్ స్వయంగా తెరదించాడు. మార్చి 27 నుండి ఏప్రిల్ 30, ఆపై జూన్ 26 అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. 'పెద్ది' ఆలస్యం కావడం లేదని, సినిమా అద్భుతంగా వచ్చిందని రామ్ చరణ్ తెలిపారు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కాస్త ఊరటనిచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్డ్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ తేదీన కూడా పెద్ది రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా ఒక సినిమా ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న ‘పెద్ది’ వస్తుందనేసరికి మెగా అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ది విడుదల తేదీపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తన సినిమా జూన్ 26 తేదీ విడుదల కాబోతుందంటూ వస్తోన్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించాడు. తన చెల్లెలు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకాస సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ కూడా చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేశారు. ఇందులో భాగంగా పెద్ది సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. పెద్ది సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పిన రామ్ చరణ్.. అందరికీ పరీక్షలు అయిపోతాయని, ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. అదే సమయంలో పెద్ది సినిమా లేట్ అవ్వట్లేదు, ఈ విషయాన్ని ప్రమోట్ చేయండి అంటూ చరణ్ రాకాస చిత్ర బృందంతో చెప్పాడు. దీంతో మెగా అభిమానులు కన్ఫూజన్ నుంచి బయటపడి.. పెద్ది కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. అయితే మరి కొంత మంది చరణ్ చెప్పిన మాటలను కూడా నమ్మకుండా.. అఫీషియల్ డేట్ అండ్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ పక్క చరణ్ చెబుతున్నా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తామంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Follow Us