AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad Airport: ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన సర్కార్.. మరో కీలక ముందడుగు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో ముందడుగు పడింది. భూసేకరణపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. అదనపు భూమిని సేకరించడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ల్యాండ్ సరిపోదనే ఉద్దేశంతో కొత్తగా భూమిని సేకరించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.

Adilabad Airport: ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన సర్కార్.. మరో కీలక ముందడుగు
Adilabad Airport
Venkatrao Lella
|

Updated on: Apr 03, 2026 | 3:24 PM

Share

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండగా.. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వరంగల్ సమీపంలోని మామునూరు వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తవ్వగా.. జూన్‌లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ప్రధాని మోదీని శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక ఆదిలాబాద్‌లో కూడా ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. డీపీఆర్ కూడా రెడీ చేశారు.

మరో 430 ఎకరాల సేకరణ

ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో ఎయిర్‌స్ట్రిప్ ఉండగా.. దీనికి అనుకుని పూర్తిస్థాయి ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొంత భూమిని సేకరించగా.. మరో 430 ఎకరాల భూమి సేకరించేందుకు తాజాగా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ వద్ద ఉన్న భూమి సరిపోదనే ఉద్దేశంతో మరింత భూమి సేకరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ, అర్బన్ మండలాల పరిధిలో భూమిని సేకరించడంపై దృష్టి పెట్టింది. ఖానాపూర్, నిషాన్ ఘాట్, అనుకుంట గ్రామాల్లో 43.30 ఎకరాల భూమిని సేకరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ గెజిట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన 369 ఎకరాల స్థలం ఉంది. అయితే ఇది ఎయిర్‌పోర్ట్ కోసం సరిపోదనే అంచనాకు అధికారులు వచ్చారు. దీంతో అదనపు భూమిని సేకరించే ప్రక్రియను వేగంతం చేశారు.

ఉడాన్ 2.0 పథకం

ఉడాన్ 2.0లో భాగంగా ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తిస్థాయి ఎయిర్‌పోర్టులుగా మార్చాలనే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. రక్షణశాఖ ఆధీనంలో ఆదిలాబాద్ ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీంతో దాని పక్కనే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్ట్ నిర్మించనుంది. దీంతో మరింత భూమిని సేకరిస్తోంది. ఉడాన్ 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 100 ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించేందుకు సిద్దమైంది. అందులో భాగంగా తెలంగాణలో ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్, ఏపీలో నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్ట్ నిర్మించాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ ఎయిర్‌పోర్ట్ పనులు వేేగవంతం అయ్యాయి. కాగా ఇప్పటికే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ డీపీఆర్ సిద్దం కాగా.. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే పనులు ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లేదు. నాగార్జున సాగర్     ఎయిర్ పోర్ట్ వస్తే చుట్టుపక్కల జిల్లాలకు కనెక్టివిటీ మరింత పెరగనుంది.

Follow Us