AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!

తెలుగు సినీ పరిశ్రమలో యువ నిర్మాతలు కొత్త కంటెంట్‌తో తమ సత్తా చాటుతున్నారు. యువ నిర్మాతల్లో మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆమె స్థాపించిన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పదేళ్లు పూర్తి చేసుకుంది. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్ నుంచి ‘కమిటీ కుర్రోళ్లు’ వరకు సాధించిన విజయాలు ఆమె జర్నీని మరింత ఇన్‌స్పైరింగ్‌గా నిలబెట్టాయి. ఆమెలానే మరికొందరు యంగ్ ప్రొడ్యూసర్లు టాలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు.

టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!
Niharika Konidela
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 4:01 PM

Share

తెలుగు ఇండస్ట్రీలో యువ నిర్మాతల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పెట్టుబడులు పెట్టడమే కాకుండా.. కంటెంట్ సెలెక్షన్‌లోనూ కొత్త పుంతలు తొక్కుతూ ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేస్తున్నారు. ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె స్థాపించిన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె జర్నీని చూస్తే ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్న నిహారిక.. గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సాగుతున్న ఆమె పదేళ్ల ప్రయాణం.. ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘రాకాస’ సినిమా నిర్మాణంతో మరింత వేగంగా ముందుకు సాగుతోంది. నెక్ట్స్ అన్నయ్య వరుణ్ తేజ్‌తోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక మరో యువ నిర్మాత వంశీ నందిపాటి దూకుడు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా.. కంటెంట్ ఉన్న సినిమాలను పంపిణీ చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా బన్నీ వాస్‌తో చేతులు కలిపి గత ఆర్నెళ్లలోనే ఏకంగా 6 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ‘రాజు వెడ్స్ రాంభాయ్’, ‘లిటిల్ హార్ట్స్’, ‘ఈషా’, ‘మిత్రమండలి’, ‘శ్రీ చిదంబరం గారు’, ‘హే బలవంత్’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను విడుదల చేసి సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్‌గా ఎదిగాడు. ఈ జోరును కొనసాగిస్తూనే.. మార్చి 6న ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఉన్న మరో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

టాలీవుడ్‌కు వరస హిట్లు ఇస్తున్న మరో ఇద్దరు క్రేజీ ప్రొడ్యూసర్లు సాహు గారపాటి, నిరంజన్ రెడ్డి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి వరుసగా క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి ‘హనుమాన్’ సినిమాతో ఏకంగా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ సక్సెస్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఇప్పుడు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ‘సంబరాల ఏటిగట్టు’ అనే మరో విభిన్నమైన కథను నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. వారసత్వాన్ని నిలబెట్టడంలోనూ మన యువ నిర్మాతలు ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ నాన్నకు తగ్గ తనయలుగా ‘వైజయంతి మూవీస్’, ‘స్వప్న సినిమాస్’ బ్యానర్లను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

‘మహానటి’, ‘జాతిరత్నాలు’, ‘సీతారామం’ లాంటి క్లాసిక్ హిట్స్‌తో టాలీవుడ్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించారు. అలాగే స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా చేస్తున్న ప్రయోగాలు ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ‘మళ్లీ రావా’ లాంటి క్యూట్ లవ్ స్టోరీ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి డిటెక్టివ్ థ్రిల్లర్, ‘మసూద’ లాంటి హారర్.. ఇలా ఏ సినిమా తీసినా ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ కమర్షియల్ హిట్స్ అందుకుంటున్నాడు. మొత్తంగా చూసుకుంటే.. ఈ యువ నిర్మాతలంతా కలిసి తెలుగు సినిమా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమా నిర్మాణం అంటే కేవలం బడ్జెట్ వ్యవహారం మాత్రమే అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు కంటెంట్‌ ఈజ్ కింగ్ అని ఈ మోడ్రన్ ప్రొడ్యూసర్స్ బలంగా నమ్ముతున్నారు. కొత్త డైరెక్టర్స్, నటీనటులను ఎంకరేజ్ చేయడంతో పాటు.. ప్రమోషన్స్‌లోనూ డిజిటల్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు.

Follow Us