AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా బైక్, ప్రతీ నెలా రూ.2,500 స్కాలర్‌షిప్..! వీరికి మాత్రమే ఛాన్స్..

విద్యార్థులకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న ఇంటర్ విద్యార్థులకు ఉచితగా ఈ-స్కూటర్లు అందించేందుకు సిద్దమవుతోంది. ఇక పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరితే స్కాలర్ షిప్‌లు వంటి ప్రతిపాదనలు విద్యాశాఖ చేసింది.

Telangana: విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా బైక్, ప్రతీ నెలా రూ.2,500 స్కాలర్‌షిప్..! వీరికి మాత్రమే ఛాన్స్..
Telangana Inter Students
Venkatrao Lella
|

Updated on: Feb 26, 2026 | 3:33 PM

Share

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ఈ-స్కూటర్లు అందించాలని యోచిస్తోంది. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు వీటిని అందించనుంది. కొంతమంది విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక చదువులకు దూరమవుతున్నారు. వారి చదువులు ఆగకూడదనే ఉద్దేశంతో వీటిని పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించనుంది. తొలుత వెయ్యి మంది ఇంటర్ విద్యార్థులను ఈ-స్కూటర్లను అందించేందుకు రెడీ అవుతోంది. విడతల వారీగా మిగతావారికి వీటిని ఉచితంగా పంపిణీ చేయనుంది. ఒక్కో వెహికల్ రూ.80 వేల వరకు పడుతుంది. కానీ బల్క్‌గా కొనుగోలు చేస్తే రూ.50 వేలకు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తక్కువ ధరకు కంపెనీల నుంచి కొనుగోలు చేసి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది.

ప్రభుత్వం త్వరలో ఆమోదం

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విద్యార్థులకు ఈ స్కూటర్లను అందించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. దీంతో ప్రభుత్వం త్వరలోనే దీనిని ఆమోదించి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి నుంచే ప్రతిపాదన రావడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు టెన్త్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని చూస్తోంది. అందులో భాగంగా పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో చేరితో స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని విద్యాశాఖ ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టింది. ఇందుకు ఏడాదికి రూ.10 కోట్లు అసవరమవుతాయని ఇంటర్ విద్యాశాఖ అంచనా వేసింది. దీనికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశముంది.

ట్రాన్స్‌జెండర్లకు ప్రతీ నెలా రూ.2,500

ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరే ట్రాన్స్‌జెండర్లకు ప్రతీ నెలా రూ.2,500 స్కాలర్‌షిప్ ఇచ్చే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. దీని వల్ల వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నోటుపుస్తకాలు, కాలేజ్ డ్రెస్‌లతో వెల్ కమ్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో డ్రాఫౌట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని నివారించేందుకు స్కాలర్‌షిప్‌లు, ప్రోత్సహకాలు అందించాలని విద్యాశాఖ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచిది. దీని వల్ల విద్యార్థుల చదువు మధ్యలో ఆగదని ఆలోచిస్తోంది.  అటు బుధవారం నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. గురువారం నుంచి సెకండియ్ ఎగ్జామ్స్  మొదలయ్యాయి. మార్చి 18తో పరీక్షలు ముగియనున్నాయి.

Follow Us