AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay – Rashmika Wedding: రూ.5 కోట్లు పెడితే రూ.130 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. రష్మిక నటించిన ఈ రొమాంటిక్ మూవీ చూశారా.. ?

వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. ఈరోజు ఉదయం పది గంటలకు ఉదయ్ పూర్ లోని ఐటీసీ ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. ఈ వేడకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీతారలు సైతం సందడి చేసినట్లు తెలుస్తోంది.

Vijay - Rashmika Wedding: రూ.5 కోట్లు పెడితే రూ.130 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. రష్మిక నటించిన ఈ రొమాంటిక్ మూవీ చూశారా.. ?
Geetha Govindam
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2026 | 3:01 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీతారలు హాజరైనట్లు సమాచారం. మరోవైపు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పెళ్లి అనంతరం ఐటీసీ ప్యాలెస్ బయట మీడియా మిత్రులకు, స్థానికులకు రష్మిక టీమ్ స్వీట్ బాక్సులు పంచింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక, విజయ్ కెరీర్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్ . ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది రష్మిక. ఇప్పటికీ ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

తెలుగులో రష్మిక క్రేజ్ మార్చిన సినిమా గురించి మీకు తెలుసా.. ? కేవలం రూ.5 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.130 కోట్లు కొల్లగొట్టింది. ఆ సినిమా మరెదో కాదు.. గీతా గోవిందం. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక.. ఆ వెంటనే గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇద్దరు జోడీ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పాన్ వరల్డ్ లెవల్లో అత్యధిక వసూల్లు రాబట్టింది. ఈ సినిమా విజయ్, రష్మికకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ జీ5లో అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us