AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్‌ అలర్ట్‌..! మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం!

రైల్వే సీనియర్ అధికారులుగా నటిస్తూ సైబర్ నేరస్థులు సిబ్బంది, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వ్యక్తిగత, ఆర్థిక వివరాలను కోరుతున్నారు. PPO అప్‌డేట్లు, KYC ధృవీకరణ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అనుమానాస్పద కాల్స్ సైబర్ సెల్‌కు నివేదించాలి.

Indian Railway: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్‌ అలర్ట్‌..! మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం!
Railway Cyber Fraud
SN Pasha
|

Updated on: Feb 26, 2026 | 3:43 PM

Share

రైల్వే సీనియర్ అధికారులుగా నటిస్తూ సిబ్బందిని వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సైబర్ నేరస్థుల పట్ల రైల్వే బోర్డు తన ఉద్యోగులను హెచ్చరించింది. బోర్డు ప్రకారం మోసగాళ్ళు కొంతమంది జూనియర్ సిబ్బందిని ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా సంప్రదించి, వారిని మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వ్యక్తిగత, ఆర్థిక వివరాలను కోరుతున్నారు.

కొంతమంది సైబర్ మోసగాళ్ళు రైల్వే అధికారుల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు, SMS లేదా వాట్సాప్ సందేశాలను పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రైల్వే బోర్డు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సందేశాలు PPO అప్డేట్లు, KYC ధృవీకరణ, అదనపు పెన్షన్ ప్రయోజనాలు, ఇలాంటి క్లెయిమ్‌ల సాకుతో వ్యక్తిగత, ఆర్థిక వివరాలను కోరుతాయి. ఏ రైల్వే అధికారికి ఫోన్ కాల్స్, SMS, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బ్యాంక్ వివరాలు, OTPలు, పాస్‌వర్డ్‌లు లేదా ఏదైనా గోప్య సమాచారాన్ని కోరే అధికారం లేదని బోర్డు స్పష్టం చేసింది.

ఉద్యోగులు, పెన్షనర్లకు సూచన..

ఉద్యోగులను, ముఖ్యంగా పెన్షనర్లను హెచ్చరిస్తూ రైల్వేలు PPO లేదా సర్వీస్ రికార్డులను అప్డేట్‌ లింక్‌లు లేదా సందేశాలను పంపవని బోర్డు స్పష్టం చేసింది. పింఛనుదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి మోసపూరిత కార్యకలాపాల గురించి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆ ప్రకటన కోరింది. ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా సందేశం వస్తే వెంటనే పోలీస్ సైబర్ సెల్, సంబంధిత పరిపాలనా కార్యాలయానికి నివేదించాలని బోర్డు సూచించింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us