Business Idea: అతి తక్కువ పెట్టుబడి.. ఎప్పటికీ డిమాండ్ తగ్గని బిజినెస్! ప్రతి రోజూ లాభమే
రూ.2 లక్షల చిన్న పెట్టుబడితో ఫుడ్ బిజినెస్ ప్రారంభించడం సాధ్యమే. సరైన ప్రణాళికతో టిఫిన్ సెంటర్, బ్రేక్‌ఫాస్ట్ పాయింట్ వంటివి మొదలుపెట్టి, రోజుకు రూ.800-రూ.1500 లాభం పొందవచ్చు. పరిశుభ్రత, రుచి, సరసమైన ధరలతో కస్టమర్లను ఆకర్షించి, ఆన్‌లైన్ డెలివరీ ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు.

ఎప్పటికీ డిమాండ్ తగ్గని బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది ఫుడ్ బిజినెస్. ఈ క్రమంలోనే చిన్న పెట్టుబడితో స్వంత వ్యాపారం ప్రారంభించాలని భావించే యువతలో ఫుడ్ రంగంపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా రూ.2 లక్షల పెట్టుబడితో హోటల్ లేదా టిఫిన్ సెంటర్ మొదలు పెట్టొచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. వ్యాపార నిపుణుల ప్రకారం సరైన ప్రణాళిక ఉంటే చిన్న స్థాయిలో ఈ బిజినెస్ ప్రారంభించడం సాధ్యమే.
రూ.2 లక్షల బడ్జెట్‌తో పెద్ద రెస్టారెంట్ ప్రారంభించడం కష్టం అయినప్పటికీ చిన్న టిఫిన్ సెంటర్, బ్రేక్‌ఫాస్ట్ పాయింట్, టీ-స్నాక్స్ స్టాల్ వంటి మోడళ్లతో మొదలు పెట్టవచ్చు. అద్దె తక్కువగా ఉన్న ప్రాంతం ఎంచుకుంటే పెట్టుబడి నియంత్రణలో ఉంటుంది. స్టౌ, గ్యాస్, పాత్రలు, టేబుళ్లు, కుర్చీలు, ముడి సరుకు కోసం ప్రారంభ ఖర్చు సాధారణంగా ఈ బడ్జెట్‌లోనే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
లాభాల విషయానికి వస్తే ఇది పూర్తిగా లొకేషన్, కస్టమర్ రద్దీ, ధరల వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రోజుకు 100 నుంచి 150 ప్లేట్లు టిఫిన్ లేదా స్నాక్స్ అమ్మగలిగితే సగటున రూ.3,000 నుంచి రూ.6,000 వరకు రోజువారీ టర్నోవర్ సాధ్యమవుతుంది. ఖర్చులు తీసేసిన తర్వాత రోజుకు సుమారు రూ.800 నుంచి రూ.1,500 వరకు నికర లాభం రావచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే పరిశుభ్రత, రుచికరమైన ఆహారం, స్థిరమైన నాణ్యత, సరైన ధరలు ఉంటే కస్టమర్లు త్వరగా పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లలో నమోదు చేసుకుంటే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి రూ.2 లక్షలతో చిన్న స్థాయి హోటల్ బిజినెస్ ప్రారంభించడం సాధ్యమే. అయితే పెద్ద లాభాలు వెంటనే ఆశించకుండా, స్థిరంగా కస్టమర్ బేస్ పెంచుకుంటూ ముందుకు సాగితే ఈ రంగంలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
