AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రతీ ఇంటికి క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే క్షణాల్లోనే పేమెంట్ .. ప్రభుత్వం కొత్త సేవలు

ఆస్తి పన్ను చెల్లించాలంటే మీరు ఇక ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే అతికించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. అలాగే మీ ఇంటికి సంబంధించిన వివరాలు, ఇప్పటివరకు ఎంత చెల్లించారు లాంటి వివరాలు తెలుసుకోవచ్చు.

Andhra Pradesh: ప్రతీ ఇంటికి క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే క్షణాల్లోనే పేమెంట్ .. ప్రభుత్వం కొత్త సేవలు
QR code
Venkatrao Lella
|

Updated on: Feb 26, 2026 | 4:05 PM

Share

ఆస్తి పన్ను కట్టాలంటే ఇప్పటివరకు మీ సేవ, ఈ-సేవ లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంటి వద్దనే మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులువుగా క్షణాల్లోనే చెల్లించవచ్చు. మీ ఇంటికి లేదా డోర్‌కు మున్సిపల్ అధికారులు క్యూఆర్ కోడ్‌తో కూడిన కాగితం అతికిస్తారు. అది మీరు ఎప్పుడైనా స్కాన్ చేసి ఆస్తి పన్ను చెల్లించవచ్చన్నమాట. దీని వల్ల మీ సమయం కూడా ఆదా అవుతుంది. ఇక కేవలం ఆస్తి పన్ను చెల్లించడమే కాకండా మున్సిపల్ సేవలకు సంబంధించి ఏ ఫిర్యాదు చేయాలన్నా దీని ద్వారానే తెలియజేయవచ్చు. త్వరలోనే క్యూఆర్ కోడ్ అధారిత వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన బ్యాగ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తి కావొచ్చింది. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అభివృద్ది చేస్తోంది.

అన్ని సిటీలు, పట్టణాల్లో అందుబాటులోకి..

ఏపీలోని అన్ని సిటీలు, పట్టణాల్లో క్యూఆర్ కోడ్ ఆధారంగా ఆస్తి పన్ను, ఫిర్యాదులు చేసే సదుపాయాన్ని మున్సిపల్ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఆస్తి పన్ను మాత్రమే కాకుండా మున్సిపల్ సేవలకు సంబంధించిన ఇతర ఫీజుల కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మంది ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయలకు టెక్నాలజీతో కూడుకున్న ఈ క్యూఆర్ కోడ్ స్కానర్లను అతికించనున్నారు. డోర్లకు లేదా ఇంటికి వీటిని అతికిస్తారు. దీని ద్వారా ఆస్తి పన్ను చెల్లించడం, చెత్త కూరుకుపోయినా ఫిర్యాదు చేయడం లాంటి మున్సిపల్ శాఖ అందించే సేవలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు మున్సిపల్ సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయాలంటే కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇక అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు కంప్లైంట్ చేయాల్సి వచ్చేది. ఇక నుంచి అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు.

పుర మిత్ర యాప్

ఇటీవల ఏపీ ప్రభుత్వం పుర మిత్ర పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైనా సమస్య కనిపిస్తే ఫొటోలతో సహా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు రెండు, మూడు రోజుల్లో సమస్య ఉన్న ప్రాంతానికి చేరుకుని పరిష్కరించాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే పరిష్కరించాల్సి ఉంటుది. మున్సిపల్ కమిషనర్ లాగిన్స్‌తో హాట్ స్పాట్లుగా ఇవి కనిపిస్తాయి. దీంతో కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది.

Follow Us