Viral Video: ఇదెక్కడి మాస్ రివేంజ్ మావ.. పాపం అమ్మాయిని ఎగిరి తన్నిన కొండముచ్చు.. వీడియో వైరల్..
ఆ వీడియోలో ఓ పాఠశాల ముందు అందరు విద్యార్థులు నిల్చుని ప్రార్దన చేస్తున్నారు. అక్కడే విద్యార్థులందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని ఉన్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఏనుగులు, సింహాలు, చిరుతపులులు, కోతులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని సార్లు ఆకస్మాత్తుగా జరిగిన సంఘటనలు అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఈ వీడియోలు నవ్వులు పూయించడమే కాకుండా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పాపం.. ఓ కొండముచ్చుకు అమ్మాయిపై తెగ కోపం వచ్చేసినట్టుంది.. వెంటనే వెళ్లి ఎగిరి తన్నింది. దీంతో అమ్మాయి కింద పడిపోయింది.
అసలు విషయానికి వస్తే.. ఆ వీడియోలో ఓ పాఠశాల ముందు అందరు విద్యార్థులు నిల్చుని ప్రార్దన చేస్తున్నారు. అక్కడే విద్యార్థులందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని ఉన్నారు. ఆకస్మాత్తుగా అక్కడకు వచ్చిన ఓ కొండముచ్చు ఓ వరుస చివరలో ఉన్న అమ్మాయిన దగ్గరు వెళ్లి వెనక నుంచి ఎగిరి తన్నింది. దీంతో ఆ అమ్మాయి కింద పడిపోయింది. కొండముచ్చు దాడిని చూసి అక్కడున్నవారంత షాకయ్యారు.. ఏం జరిగిందని తెరుకునేలోపే ఆ కొండముచ్చు అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.