Sai Pallavi: అప్పుడే నాకు పెళ్లైపోతుంది అనుకున్నాను.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్..

ఈ సినిమాకు డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా.. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని

Sai Pallavi: అప్పుడే నాకు పెళ్లైపోతుంది అనుకున్నాను.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 11, 2022 | 3:56 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది సాయి పల్లవి (Sai Pallavi). మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంది ఈ చిన్నది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కంటెంట్ ఉన్న రోల్స్ చేస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి, లవ్ స్టోరీ, దియా, కణం, పడిపడి లేచే మనసు సినిమాల్లో నటించిన సాయి పల్లవి.. ఇటీవల నాని సరసన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటించి మరోసారి ఆడియన్స్‏ను మెప్పించింది. ఈ మూవీలో ఆమె నటనకు సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమాకు డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా.. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది…

మా ఇంట్లో తెలుగు మాట్లాడడంతో తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటావా ? అని అడుగుతుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. తనకు 23 ఏళ్ల వయసులో పెళ్లి అయిపోతుందని.. 30 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారనుకున్నాని తెలిపింది. పుట్టపర్తి సాయి బాబా పేరు తనకు పెట్టారని.. తను ఇప్పటికీ సాయి బాబా భక్తురాలినని తెలిపింది. తనకు నచ్చకపోతే ఆ దారిలోకి వెళ్లేందుకు ఇష్టపడడని.. ఒకవేళ సినీ ఇండస్ట్రీ నచ్చకపోయి ఉంటే .. సైలెంట్ గా చదువుకునేదాన్ని అని అన్నారు. పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అని తను చెప్పడం లేదని.. తనను చూసే విధానం మారడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రీ సినిమాలోని ఓయిరబ్బా పాటలోని స్టెప్స్ వేసేందుకు అనేక సార్లు ప్రయత్నించానని.. ఇప్పటివరకు తాను నటించిన సినిమాలన్నింటికీ తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నానని తెలిపింది సాయి పల్లవి.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే విరాట పర్వం సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. జూన్ 17న విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ విరాట పర్వం.

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే