Lokesh kanagaraj: ‘ఖైదీ’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన లోకేశ్‌.. స్టోరీలైన్‌ చెప్పేసిన డైరెక్టర్‌..

Lokesh kanagaraj: విక్రమ్‌ (Vikram) సినిమాతో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ పేరు మరోసారి మారమోగుతోంది. కమలహాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను రాబడుతూ..

Lokesh kanagaraj: 'ఖైదీ' సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన లోకేశ్‌.. స్టోరీలైన్‌ చెప్పేసిన డైరెక్టర్‌..
Follow us

|

Updated on: Jun 11, 2022 | 1:16 PM

Lokesh kanagaraj: విక్రమ్‌ (Vikram) సినిమాతో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ పేరు మరోసారి మారమోగుతోంది. కమలహాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోందీ సినిమా. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ తర్వాతి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టిపడింది. 2019లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఖైదీ’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇదిలా ఉంటే లోకేశ్‌ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఈ సినిమా కూడా ఖైదీ టైటిల్‌తోనే తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో తాజాగా లోకేశ్‌ ఈ సీక్వెల్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖైదీ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు. హీరో జీవితం ఢిల్లీ జైలులో ఎలా గడిచింది అన్న కథాంశంతో ఈ సినిమా ఉండనున్నట్లు లోకేశ్‌ తెలిపాడు.

సినిమా కథ గురించి మాట్లాడుతూ.. ‘ఫ్లాష్‌ బ్యాక్‌తో సినిమా మొదలు అవుతుంది. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో కప్పులు గెలిచే హీరో.. ఆ తర్వాత మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి, తన కూతురును తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత పోలీసులకు మళ్లీ హీరో అవసరం వస్తుంది. అసలు పోలీసులకు హీరో వచ్చిన అవసరం ఏంటి.? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి’ అన్నది సినిమా కథ అని చెప్పుకొచ్చాడు లోకేశ్‌. మరి విక్రమ్‌తో ఇండస్ట్రీని సొంతం చేసుకున్న లోకేశ్‌ కనగరాజ్‌ ఖైదీ సీక్వెల్‌తో ఎలాంటి వండర్స్‌ చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ