Pushpa 2: ‘పుష్పరాజ్‌’ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. జెట్‌ స్పీడ్‌తో షూటింగ్‌, థియేటర్లలో సందడి చేసేది అప్పుడే..

Pushpa 2: అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో చెప్పాన పనిలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌...

Pushpa 2: 'పుష్పరాజ్‌' ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. జెట్‌ స్పీడ్‌తో షూటింగ్‌, థియేటర్లలో సందడి చేసేది అప్పుడే..
Pushpa Moive
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 11, 2022 | 12:12 PM

Pushpa 2: అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో చెప్పాన పనిలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ డాన్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ తన ప్రయాణంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడన్న కథాంశంతో సీక్వెల్ తెరకెక్కుతోంది.

పార్ట్‌1కి మంచి సీక్వెల్‌ ఉండేలా సుకుమార్‌ జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే షూటింగ్ విషయంలో సుకుమార్‌ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇక సినిమాను కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చేందుకు ఈ లెక్కల మాస్టర్‌ భారీ ప్లాన్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. జూలైలో నెక్ట్స్‌ షెడ్యూల్‌ను మొదలు పెట్టి వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేయాలని చూస్తున్నాడు. 6 నెలలో అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్‌ భావిస్తున్నాడు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే పార్ట్‌1లో సమంత స్పెషల్‌ సాంగ్‌ హైలెట్‌గా నిలిచిన నేపథ్యంలో సుకుమార్‌ ఈసారి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని రంగంలోకి దింపుతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కూడా ఎలాంటి ప్రకటనరాలేదు. మరి పుష్పతో వండర్స్‌ క్రియేట్‌ చేసిన సుకుమార్‌ సీక్వెల్‌తో ఎలాంటి రికార్డులను బద్దలు కొడతాడో తెలియాంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..