Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగా టచ్.. చిరుతోపాటు..

తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఏకైక ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను, ఆసక్తి కలిగించే వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు అందిస్తుంది ఆహా(Aha).

Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగా టచ్.. చిరుతోపాటు..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2022 | 12:33 PM

తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఏకైక ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను, ఆసక్తి కలిగించే వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు అందిస్తుంది ఆహా(Aha). అలాగే ఆకట్టుకునే గేమ్ షోస్తో పాటు ప్రేక్షకులను ఉర్రుతలూగించే అతిపెద్ద సంగీత వేదికైన తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol)ను కూడా మన ముందుకు తీసుకువచ్చింది ఆహా. అత్యుత్త‌మ‌మైన తెలుగు గాత్రాన్ని క‌నుగొనే ఉద్దేశంతో ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌ను ఆహా నిర్వహిస్తుంది. సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో ముగింపుకు వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

తనదైన స్టైల్‌లో కంటెస్టెంట్లతో చిరంజీవి సందడి చేశారని,చమక్కులు విసిరారని తెలుస్తుంది. మెగాస్టార్‌తో పాటు విరాటపర్వం మూవీ హీరో హీరోయిన్ రానా, సాయి పల్లవి కూడా హాజరయ్యారు. వీరికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నట సింహం నందమూరి బాలకృష్ణను కూడా ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షోకి ఆహా తీసుకువచ్చిన విషయం తెలిసిందే బాలయ్య గెస్ట్ గా రావడంతో కంటెస్టెంట్లలో జోష్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు తొలి ఇండియన్ ఐడల్ ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 17 ఈ ఈగ్రాండ్ ఫినాలే స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .