Pawan Kalyan: పవర్‌స్టార్‌ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ .. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ డైరెక్టర్‌.. ఇలాంటివి పోస్ట్‌ చేసేముందు అంటూ..

Harish Shankar: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), స్టార్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం గబ్బర్‌ సింగ్‌. 2012లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌ రికార్డులను తిరగేసింది. ఇప్పుడీ క్రేజీ కాంబినేషన్‌లో మరో చిత్రం..

Pawan Kalyan: పవర్‌స్టార్‌ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ .. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ డైరెక్టర్‌.. ఇలాంటివి పోస్ట్‌ చేసేముందు అంటూ..
Pawan Kalyan
Basha Shek

|

Jun 10, 2022 | 6:31 PM

Harish Shankar: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), స్టార్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం గబ్బర్‌ సింగ్‌. 2012లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌ రికార్డులను తిరగేసింది. ఇప్పుడీ క్రేజీ కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. అదే భవదీయుడు భగత్‌ సింగ్. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని రోజుల నుంచి నెట్టింట్లో ఆ ఆసక్తికర విషయం తెగ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ (SalmanKhan) కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని.. ఈ విషయంపై ఇటీవల హరీశ్‌ ముంబయి వెళ్లి ఆయనను ప్రత్యేకంగా కలిశారని వార్తలు వచ్చాయి. ఇవి వైరల్‌ కావడంతో హరీశ్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

పది కాలాల పాటు గుర్తుండేలా..

ట్విట్టర్‌ వేదికగా ‘ఇందులో ఏ మాత్రం నిజం లేదండి. మీరు ఇలాంటి వార్తలు ఏదైనా పోస్ట్‌ చేసేముందు నన్ను ఒక్కసారి సంప్రదించండి. ఏ సమయంలోనైనా నేను అందుబాటులోనే ఉంటాను’ అంటూ హిలేరియస్‌గా రిప్లై ఇచ్చాడు. ఇక గురువారం సాయంత్రం జరిగిన నాని ‘అంటే.. సుందరానికీ..’ ప్రీ రిలీజ్‌ వేడుకలోనూ భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమాపై స్పందించారు హరీశ్‌. ఈ ప్రాజెక్టు గురించి వస్తోన్న వివిధ రకాల రూమర్లను ఖండిస్తూ త్వరలోనే సినిమా షూట్‌ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. పవర్‌స్టార్‌తో సినిమా ఎప్పుడు వచ్చినా సరే మీరు మళ్లీమళ్లీ చూసేలా ఉంటుంది. డైలాగులు, పాటలు పదికాలాలపాటు గుర్తుండేలా ఉంటాయి’ అంటూ అభిమానులను ఉత్సాహ పరిచారు. కాగా సల్మాన్‌ ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న గాడ్‌ఫాదర్‌లో ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Balakrishna Birthday: బాలయ్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆహా.. కళ్లకు గంతలు కట్టి గ్రాండ్‌గా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. వీడియో ఇదుగో..

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపటి నుంచి జ్యేష్టాభిషేకం టికెట్ల బుకింగ్‌.. పూర్తి వివరాలివే..

ఇవి కూడా చదవండి

Investment: పిల్లల చదువు.. పెళ్లిళ్ల కోసం ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంచిది? PPF, NSC, సుకన్య పథకాలలో బెస్ట్ ఏది?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu