Tollywood: నేడు ఈ ఇద్దరు హీరోలకు స్పెషల్ డే.. వీరికి మాత్రమే సొంతమైన వెరీ రేర్ రికార్డ్ గురించి మీకు తెల్సా..?
కాగా అటు బాలయ్యకు, ఇటు నానికి ఓ సిమిలర్ రికార్డు ఉంది. ఈ ఇద్దరూ హీరోలు ఒక్కరోజే తాము నటించిన 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. చాలా అరుదుగా మాత్రం ఇలా జరుగుతుంటుంది.
Balakrishna-Nani: నందమూరి నటసింహ.. నటరత్న.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయనకున్న ఇమేజ్ ముందు తక్కువే. తండ్రి చాటు బిడ్డగా 14వ ఏటే ఇండస్ట్రీకి వచ్చిన ఆయన.. టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. 60 దాటిన తర్వాత కూడా అదే జోరు చూపిస్తూ అందరితోనూ జై బాలయ్య అనిపించుకుంటున్నారు. ఇటు సినిమాలు.. అటు రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. దీంతో దేశ విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు బాలయ్య బర్త్ డేను ఓ పండుగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం అంటే.. డిజిటల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు.. చేసే సినిమాలు.. చేస్తున్న సినిమాలు.. చేయబోయే వాటిలోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు బాలయ్య. అందుకే ఒకప్పటి కంటే ఇప్పుడు బాలయ్య సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ అటెన్షన్ పెరిగిపోయింది.
ఇక పక్కాంటి కుర్రాడిలా ఉంటాడు అనే ఇమేజ్ సొంతం చేసుకుని.. నేచురల్ స్టార్ ట్యాగ్ దక్కించుకుని.. ఇండస్ట్రీలో తన మార్క్ వేశారు నాని. సినిమా ఫ్లాప్ అయినా నాని నిరాశపరచడు అంటుంటారు ఆయన అభిమానులు. సహాయ దర్శకుడిగా మొదలై స్టార్ హీరోగా ఎదిగిన ఆయన కెరీర్ ఎందరికో ఆదర్శం. కాగా తాజాగా ఈ శుక్రవారం ‘అంటే సుందరానికీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్తుంది. కాగా అటు బాలయ్యకు, ఇటు నానికి ఓ సిమిలర్ రికార్డు ఉంది. ఈ ఇద్దరూ హీరోలు ఒక్కరోజే తాము నటించిన 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంటుంది. బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు రెండూ 1993 సెప్టెంబర్ 3న రిలీజయ్యాయి. అటు నాని కూడా తాను నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం , జెండాపై కపిరాజు సినిమాలను 2015 మార్చ్ 21న విడుదల చేశాడు. కాగా గతంలో ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి వారు కూడా తాము నటించిన 2 సినిమాలను ఓకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
మరిన్ని టాలీవుడ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి