Bhola Shankar: మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. భోళా శంకర్ మూవీపై కీలక అప్డేట్

మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. ఆచార్య సినిమా తర్వాత చిరు చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్.

Bhola Shankar: మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. భోళా శంకర్ మూవీపై కీలక అప్డేట్
Megastar Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2022 | 11:26 AM

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. ఆచార్య సినిమా తర్వాత చిరు చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్నారు మెగాస్టార్. చాలా కాలంగా మెహర్ రమేష్ సైలెంట్ గా ఉంటున్నారు 2013లో వెంకటేష్ హీరోగా నటించిన షాడో సినిమా తర్వాత ఇప్పుడు సినిమా చేస్తున్నారు రమేష్. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు  “’భోళా శంకర్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. ‘మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం”అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవిని మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ ఏడాది చివర్లో భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ