Nayanthara-Vignesh: కోలీవుడ్ క్రేజీ కపుల్ వెడ్డింగ్‌ స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్‌ ఎంతకు కొన్నదో తెల్సా..?

గతంలో కూడా.. సెలబ్రిటీల కమర్షియల్‌ వెడ్డింగ్‌లు చాలానే జరిగాయి. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా- అమెరికా యాక్టర్‌, సింగ్‌ నిక్ జోనాస్‌ల వివాహ వేడుకను కూడా భారీ మొత్తానికి అమ్మారు. తాజాగా అదే దారిలో నయన్-విఘ్నేష్ పయనించారు.

Nayanthara-Vignesh: కోలీవుడ్ క్రేజీ కపుల్ వెడ్డింగ్‌ స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్‌ ఎంతకు కొన్నదో తెల్సా..?
Nayanthara Vignesh Wedding
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 10, 2022 | 9:10 PM

Nayanthara Wedding: పెళ్లి… ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మధురస్మృతి. రెండు జీవితాలను కలిపే అనిర్వచనీయ బంధం.. తమకు మాత్రమే సొంతమయ్యే అపురూప ఘట్టం.. జీవితంలో జరిగే ఆ అతి పెద్ద వివాహ వేడుకను కూడా.. కమర్షియల్‌ చేసేస్తున్నారు సెలబ్రిటీలు. మదిలో పదిలంగా పెట్టుకోవాల్సిన వ్యక్తిగత విషయాలను సైతం అమ్మకానికి పెట్టేస్తున్నారు. పెళ్లిళ్లు, ప్రైవేట్‌ ఫంక్షన్‌లను కూడా ఓటీటీలకు అమ్మేస్తూ క్యాష్‌ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. గతేడాది డిసెంబరు 9న.. బాలీవుడ్​ లవ్​బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌(Vicky Kaushal – Katrina Kaif) ల పెళ్లి.. రాజస్తాన్‌ కోటలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. అయితే.. వీరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియోల ప్రసార హక్కులను.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు 80 కోట్ల రూపాయలు చెల్లించిందట. తమ పెళ్లి చుట్టూ ఏర్పడిన హైప్​ను క్యాష్​ చేసుకోవాలని భావించిన విక్కీ-కత్రినా.. పెళ్లి ఫొటోలను కూడా భారీ మొత్తానికి ఓ మ్యాగజైన్​కు విక్రయించారు. వీళ్లతో పెళ్లిని కూడా కమర్షియల్‌ చేయొచ్చనే ఆలోచన సెలబ్రిటీలలో మొదలైంది. ఇక లేటెస్ట్‌గా.. నయన్‌ విఘ్నేశ్‌ వెడ్డింగ్‌ వీడియో కూడా భారీ రేటుకు అమ్ముకున్నారు. అంతేకాకుండా.. నయనతార వివాహ వేడుక నయా ట్రెండ్‌ను క్రియేట్‌ చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్‌ డైరెక్షన్‌లో.. వీరి మ్యారేజ్‌ను.. ఒక డాక్యుమెంటరీ తరహాలో చిత్రీకరించారు.  ఈనెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్‌ వేదికగా నయన్‌ విఘ్నేశ్‌ల వివాహం అత్యంత ఘనంగా జరిగింది. నాను రౌడీదాన్‌ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఈ లవ్‌ బర్డ్స్‌ గత లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి దక్షిణాది సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ సైతం హాజరయ్యారు. అయితే.. ఈ క్రేజీ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ఓ ప్రముఖ ఓటీటీకి అమ్మేశారు.

బాలీవుడ్ జంట కత్రినా కైఫ్‌- విక్కీ కౌషల్ తరహాలోనే… ఈ కోలీవుడ్ క్రేజీ కపుల్ తమ వెడ్డింగ్‌కు సంబందించిన వీడియో స్ట్రీమింగ్ హక్కుల్ని భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్‌కి అమ్మారట..! ప్రముఖ దర్శకుడు గౌతంమీనన్ చిత్రీకరించిన.. ఎంటైర్‌ వెడ్డింగ్‌ని డాక్యుమెంటరీ స్టైల్‌లో రికార్డు చేసి స్ట్రీమింగ్‌ చేయనున్నారట. వివాహ వేడుక వరకూ బాగానే ఉన్నా.. పెళ్లిని కూడా కమర్షియల్‌ చేసి ఓటీటీలకు అమ్మేస్తుండటంపై.. విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ