Balakrishna : మునుపెన్నడూ చూడని బాలయ్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న అనిల్ రావిపూడి..

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

Balakrishna : మునుపెన్నడూ చూడని బాలయ్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న అనిల్ రావిపూడి..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2022 | 11:19 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అఖండ సినిమాతో సంచలన విజయం అందుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి బాలయ్య మాస్ యాక్షన్ తో అలరించనున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహానాస్ హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమానుంచి తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా కమిట్ అయినవిషయం తెలిసిందే.

F3తో డబుల్ హ్యాట్రిక్లు సాధించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి #NBK108 కోసం మెగాఫోన్ పట్టనున్నారు.  బాలకృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఈ కాంబోలో రానున్న చిత్రంను అధికారికంగా ప్రకటించారు. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కథనంతో భారీగా తెరకెక్కనుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పర్ఫెక్ట్, మాస్ అప్పీలింగ్ స్క్రిప్ట్ను రెడీ చేశారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ఎక్స్ టార్డీనరీగా ఉండేలా ప్రస్తుతం స్క్రిప్ట్ను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.#NBK108 చిత్ర తారాగణం, సాంకేతిక విభాగం వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .