Nayanthara Vignesh: తిరుమల వివాదంపై స్పందించిన విఘ్నేశ్.. క్షమించండి అంటూ ప్రెస్ నోట్..
Nayanthara Vignesh Wedding: ఏడేళ్లు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ల జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయ్యి 24 గంటలు కూడా గడవకముందే...
Nayanthara Vignesh Wedding: ఏడేళ్లు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ల జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయ్యి 24 గంటలు కూడా గడవకముందే ఈ జంట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన వెంటనే భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల విచ్చేసిందీ జంట. అయితే ఈ సమయంలో నయనతార ఆలయ నిబంధనలకు విరుద్దంగా మాడ వీధుల్లో చెప్పులతో తిరగడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమల మాడవీధుల్లో నయనతార చెప్పులు ధరించి రావడం దురదృష్టకరమని.. హీరోయిన్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీటీడీ తెలిపింది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చన్న అంశంపై చర్చిస్తున్నామని టీటీడీ పేర్కొంది.
అయితే తాజాగా ఈ విషయమై నయనతార భర్త విఘ్నేశ్ స్పందించాడు. తిరుమలలో జరిగిన అపచారంపై ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు. విఘ్నేశ్ ఇచ్చిన వివరణ ఏంటంటే.. ‘అందరికీ నమస్కారం.. నిజానికి మేము తిరుమలలోనే వివాహం చేసుకోవాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల చెన్నైలో చేసుకోవాల్సి వచ్చింది. దీంతో వివాహం అయిన వెంటనే కనీసం ఇంటికి కూడా వెళ్లకుండానే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లాము. దర్శనం ముగిసిన వెంటనే ఆలయం ముందు ఫొటో తీసుకోవాలని భావించాము.
అయితే భక్తులు భారీగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్లి, మళ్లీ రద్దీ తగ్గగానే తిరిగి వచ్చాము. ఆ గందరగోళంలో కాళ్లకు చెప్పులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయాము. భగవంతుడిని నమ్మే వారిగా మేము తరుచూ దైవ దర్శనాలకు వెళుతుంటాము. గడిచిన 30 రోజుల్లో శ్రీవారిని 5 సార్లు దర్శించుకున్నాము. ఈ క్రమంలోనే వివాహాన్ని కూడా అక్కడే చేసుకోవాలనుకున్నాం. కానీ అది కుదర్లేదు’ అని రాసుకొచ్చాడు విఘ్నే్‌శ్.
ఇక మాడవీధుల్లో చెప్పులతో ఉండడంపై విఘ్నేశ్ క్షమాపణలు కోరాడు. తాము ఎంతగానే ఇష్టపడే తిరుమల శ్రీవారిని అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదని, మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ క్షమాపణాలు చెబుతున్నామని తెలిపాడు. ఇక తమ పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు విఘ్నేశ్. మరి తిరుమల వివాదంపై విఘ్నేశ్ ఇచ్చిన ఈ వివరణతో అయినా వివాదం ముగుస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..