Bunny Vas: థియేటర్లో బాగా నవ్వించిన సినిమాలు కూడా ఓటిటిలో ఫ్లాప్ అవుతాయి.. బన్నీ వాసు ఇంట్రస్టింగ్ కామెంట్స్

ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత బన్ని వాసు విజయవంతమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. 2011లో వచ్చిన 100%లవ్ సినిమాతో నిర్మాతగా మారారు బన్నీ వాసు..

Bunny Vas: థియేటర్లో బాగా నవ్వించిన సినిమాలు కూడా ఓటిటిలో ఫ్లాప్ అవుతాయి.. బన్నీ వాసు ఇంట్రస్టింగ్ కామెంట్స్
Bunny Vas
Follow us

|

Updated on: Jun 11, 2022 | 11:26 AM

ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత బన్ని వాసు(Bunny Vas)విజయవంతమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. 2011లో వచ్చిన 100%లవ్ సినిమాతో నిర్మాతగా మారారు బన్నీ వాసు.. అప్పటి నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా వరకు అద్భుతమైన సినిమాలను అందించారు బన్నీ వాసు. ప్రస్తుతం ఆయన నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్, గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా బన్నీ వాసు తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘కరోనా సాధారణంగా మూడు సంవత్సరాల నుంచి చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అవన్నీ ఇప్పుడు వరసగా వచ్చేసాయి. దాంతో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు టైం దొరకలేదు అన్నారు వాసు. ఈ మధ్య అవి కూడా వరుసగా వస్తుండడంతో.. ఇక సినిమాలు గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తాను అన్నారు.  జులై 1న పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. ఇది 100% ఎంటర్టైనర్. గోపి చంద్ గారు యాక్షన్ హీరో అయినా కూడా.. మారుతి ఈ సినిమాను నవ్వించడానికి తెరకెక్కించాడు. సెప్టెంబర్ 10న నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ విడుదల చేస్తాము. దసరా సీజన్ లో సెప్టెంబర్ 30న కిరణ్ అబ్బవరంతో చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ విడుదల చేస్తాను. అలాగే ఆగస్టులో అల్లు శిరీష్ సినిమా ఉంది. అది కూడా విడుదల చేస్తాను. కంటిన్యూగా ఈ మూడు నాలుగు నెలలు గీతా ఆర్ట్స్ 2 నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి అన్నారు.

ఓటిటి గురించి కూడా నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నా సినిమాలేవీ కనీసం 35 రోజులు వ్యవధి లేకుండా ఓటిటికి ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఆ టైం గ్యాప్ ఇంక పెంచాలని చూస్తున్నాను కానీ తగ్గించాలని కాదు. మా బ్యానర్ నుంచి వచ్చేవన్నీ ఎంటర్టైనింగ్ సినిమాలు. వాటిని థియేటర్లో చూసినప్పుడే మజా వస్తుంది. థియేటర్లో బాగా నవ్వించిన సినిమాలు కూడా ఓటిటిలో ఫ్లాప్ అవుతుంటాయి. ఎందుకంటే కేవలం థియేటర్లోనే చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇక టికెట్ల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను బట్టి రేట్లు పెంచుకునే వెసలుబాటు కల్పించింది. నేను ఎంత సంపాదించాను అని కాకుండా.. ఆడియన్స్ ను థియేటర్ కి ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే పక్కా కమర్షియల్ సినిమాని కూడా అందరికి అందుబాటులో ఉండే టికెట్ రేట్స్ పెట్టాం. కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ సినిమాకి వచ్చే పాజిబిలిటే ఉన్నట్లే ప్లాన్ చేసాము. 2002 లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాతగా 2011 లో నా మొదటి సినిమా చేసాను. దాదాపుగా ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు.. రాముడు బెత్తం పడతాడు అని చెప్తే వినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. థియేటర్ లో ఆడటం కోసం ఎక్స్ట్రార్డనరీ కంటెంట్‌తో సినిమా చేయాలి. నార్మల్ ,ఆర్డినరీ కంటెంట్ తో సినిమా చేయలేము. ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ అయిపోయాక.. చందు మొండేటి, పవన్ సాధినేని సినిమాలు ఉండబోతున్నాయని’ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి