Rashmika Mandanna: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..
ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది.
ఇటీవల పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది నేషనల్ క్రష్ రష్మిక. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. వరుస ఆఫర్లును అందుకుంటూ దూసుకుపోతుంది రష్మిక (Rashmika Mandanna). ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన కోస్టార్ రణబీర్ కపూర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
రష్మిక మాట్లాడుతూ.. ” రణబీర్ కపూల్ చాలా ప్రేమ ఉన్నవాడు.. మొదటిసారి తనని కలిసినప్పుడు చాలా భయపడ్డాను.. కానీ ఐదు నిమిషాల పరిచయంలోనే అతను ఎలా ఉంటాడో తెలిసిపోయింది. మేమిద్దరం ఒకరితో ఒకరు ఎంతో సరదాగా ఉన్నాము.. రణబీర్, సందీప్‌లతో ఇప్పటివరకు ఇంతా సరదాగా గడిపాను అనేది ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సినీ పరిశ్రమలో నన్ను మేడమ్ అని పిలిచే ఏకైక వ్యక్తి రణబీర్ మాత్రమే. కానీ అతను అలా పిలవడం నాకు ఇష్టం లేదు. రణబీర్, డైరెక్టర్ సందీప్ లతో కలిసి యానిమల్ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది.. ఈ సినిమాకు నాకెప్పటికీ స్పెషల్” అంటూ చెప్పుకొచ్చింది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 11న 2023లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ లు కలిసి టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమానే కాకుండా రష్మిక హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లోనూ నటించింది.