- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti If you are concerned about your health then do not forget to take a bath after doing these 3 things.
Chanakya Niti : ఆ మూడు పనుల తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయండి.. లేకపోతే ప్రమాదంలో పడినట్లే..
ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి, అదేవిధంగా ప్రమాదంలో పడకుండా ఉండేందుకు సహాయపడతాయి. అందుకే చాలామంది.. వందలాది ఏళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలను తూచతప్పకుండా పాటిస్తుంటారు. దీనికి కారణం ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రతి విషయం ఆచరణాత్మకమైనది. చాణక్య నీతి ఎప్పుడూ కూడా తప్పు-ఒప్పుల మధ్య తేడాను బోధిస్తుంటుంది.
Updated on: Jun 11, 2022 | 2:46 PM

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యువత తప్పు సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు, వ్యసనాల వారి మధ్య కూర్చోవడం వల్ల అవతలి వారికీ చెడు అలవాట్లు ఖచ్చితంగా వస్తాయి. దీని కారణంగా యువత తన లక్ష్యాన్ని సాధించలేదు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.

జుట్టు (కటింగ్) కత్తిరించిన తర్వాత కూడా వెంటనే తలస్నానం చేయాలి. హెయిర్ కట్ తర్వాత శరీరానికి చిన్న చిన్న వెంట్రుకలు అంటుకుంటాయి. ఇలాంటి పరిస్థితిలో అసౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు కొన్నిసార్లు వెంట్రుకలు ఆహార పదార్థాల్లో పడి మీ శరీరంలో లోపలికి ప్రవేశించవచ్చు. ఇది అనారోగ్యానికి గురి చేస్తుంది. కావున జుట్టు కత్తిరించిన తర్వాత తలస్నానం చేయండి.





























