- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti in Telugu: Acharya Chanakya has told these secrets of happy life it is mentioned in Niti shastra
Chanakya Niti: సంతోషకరమైన జీవితం మీ సొంతం కావాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ జీవిత రహస్యాలను పాటించండి
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తిత్వంతో సంపన్నుడు. తన అనుభవాలనే పుస్తకాలుగా రచించాడు. ఆయన రచించిన శాస్త్రాలు నేటి తరానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని మార్గనిర్దేశం చేస్తాయని పెద్దల నమ్మకం.
Updated on: Jun 10, 2022 | 8:17 PM

జుట్టు (కటింగ్) కత్తిరించిన తర్వాత కూడా వెంటనే తలస్నానం చేయాలి. హెయిర్ కట్ తర్వాత శరీరానికి చిన్న చిన్న వెంట్రుకలు అంటుకుంటాయి. ఇలాంటి పరిస్థితిలో అసౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు కొన్నిసార్లు వెంట్రుకలు ఆహార పదార్థాల్లో పడి మీ శరీరంలో లోపలికి ప్రవేశించవచ్చు. ఇది అనారోగ్యానికి గురి చేస్తుంది. కావున జుట్టు కత్తిరించిన తర్వాత తలస్నానం చేయండి.

అతి సర్వత్రా వర్జయేత్ అని ఆచార్య చెప్పేవారు. అంతేకాదు ఎవరైనా చాలా సూటిగా ఉండడం కూడా మంచిది కాదని తెలిపారు. ఎందుకంటే నిదానంగా పెరిగే చెట్లనే మొదట నరికివేస్తారు.. అదే విధంగా సూటిగా ఉండే వ్యక్తికి అందరూ శత్రువులుగా మారతారు. అందుకే ప్రతి వ్యక్తి తనను తాను రక్షించుకునేంత వేగంగా ఆలోచనలు చేస్తుండాలి అని సూచించారు.

ఆచార్య చాణక్యుడు కోప స్వభావం గురించి కూడా చెప్పారు. కోపంతో ఉన్నవారు.. తప్పులు చేస్తారు. తరువాత దాని భారాన్ని భరిస్తారు. ఒకొక్కసారి వారికి హానిని కలిగిస్తుంది.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి తన గురువుతో ఎప్పుడూ వాదన చేయకూడదు. మన గురువు మనలను అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తారు. గురువుతో కలహించడం వలన మిమ్మల్ని మీరు గురువు నుండి దూరం చేసుకోవడమే.. అంతేకాదు మీరు జ్ఞానానికి కూడా దూరం అవుతారు. కాబట్టి మీ గురువుతో ఎప్పుడూ గొడవ పడకండి.

మీరు జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటే.. ముందుగా మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఆ లక్ష్యానికి తగిన సరైన వ్యూహాన్ని రూపొందించుకోండి. ఆ తర్వాత పూర్తి శ్రమతో ఆ లక్ష్యం వైపు పయనించండి. కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారికి.. ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఈజీగా ఛేదిస్తారు.

కొంతమంది కొన్ని పనిని పూర్తి చేయడానికి అబద్ధాలపై ఆధారపడతారు. ఇలా అబద్ధం చెప్పడం ద్వారా.. ఈ రోజు మీ పని ఏదో ఒక విధంగా పూర్తి కావచ్చు. కానీ మీ అబద్ధం దొరికిన రోజు.. మీరు మీమీద విశ్వాసంతో పాటు గౌరవాన్ని కూడా కోల్పోతారు.





























