Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miracle in sky: ఆకాశంలో అద్భుత దృశ్యం..! ఆరోజు  మిస్సైతే 2040 వరకు చూడలేరు.. అత్యంత సుందరమైన దృశ్యం..

Miracle in sky: ఆకాశంలో అద్భుత దృశ్యం..! ఆరోజు మిస్సైతే 2040 వరకు చూడలేరు.. అత్యంత సుందరమైన దృశ్యం..

Anil kumar poka

|

Updated on: Jun 18, 2022 | 8:19 AM

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం అతి త్వరలో రానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పిస్తాయి.


ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం అతి త్వరలో రానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పిస్తాయి. వీటిని ఏ బైనాక్యులర్‌ లేదా టెలిస్కోప్‌ సహాయం లేకుండా నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్లవారడానికి కొద్ది గంటల ముందు ఈ అద్భుతాన్ని చూడొచ్చు. సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తుంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. కానీ ఇలా ఐదు ప్రధాన గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడం చాలా అరుదు. 2004లో ఇలా ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో ఉన్నట్లు కన్పించాయి. అయితే ఈ అద్భుతమైన దృశ్యాన్ని సూర్యుడు ఉదయించకముందే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే, సూర్యుడికి అతి దగ్గరగా బుధగ్రహం ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తే ఆ కాంతిముందు బుధగ్రహం కన్పించదు. అందువల్ల బుధగ్రహంతోపాటు ఐదు గ్రహాలను చూడాలంటే తెల్లవారుఝూమునే తూర్పువైపున, ఎత్తయిన ప్రాంతంపై నిల్చుని చూడాల్సి ఉంటుంది. జూన్‌ 24వ తేదీ వరకు ఈ అద్భుతాన్ని వీక్షించొచ్చు. కొన్నిరోజుల్లో ఆ గ్రహాలు మిరుమిట్లు గొలుపుతూ మరింత కాంతివంతంగా కన్పిస్తాయి. ప్రత్యేకించి 24న ఇదో అద్భుత దృశ్యమే. ప్రతిసారి దాదాపు ఒక గంటసేపు ఇలా గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పిస్తాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే.. ఈ సారి బుధుడు, శనిగ్రహాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండనున్నది. అదే రోజున వీనస్, మార్స్ మధ్య చంద్రవంకను చూడొచ్చన్నారు ఎడిన్‌బరో యూనివర్శిటీ ఖగోళశాస్త్ర విభాగానికి చెందిన ఉన్నతాధికారి ప్రొఫెసర్‌ బెత్‌ బిల్లర్‌. ఈ అరుదైన దృశ్యాన్ని చూడాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి… లేదంటే మిస్‌ అవుతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 18, 2022 08:19 AM