plastic in antartica: తొలిసారి ప్లాస్టిక్ భూతం.. పెంగ్విన్‌లుండే అంటార్కిటిక్‌లో ..
ఆంటార్కిటిక్ మహాసముద్రంలో కొత్తగా కురిసిన మంచులో తాజాగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించడంతో పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడి మంచులో, ఉపరితల నీటిలో ప్లాస్టిక్‌ను
ఆంటార్కిటిక్ మహాసముద్రంలో కొత్తగా కురిసిన మంచులో తాజాగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించడంతో పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడి మంచులో, ఉపరితల నీటిలో ప్లాస్టిక్‌ను గతంలోనే గుర్తించినా కొత్తగా కురిసిన మంచులోనూ ఆ రేణువులు బయట పడటం ఇదే తొలిసారని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల మంచు కరిగే వేగం పెరిగి ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నీట మునిగి అక్కడి జనం నిరాశ్రయులవుతారని అంటున్నారు. తీర నగరాలకు ముంపు ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అంటార్కిటిక్‌లో 13 రకాల ప్లాస్టిక్‌లు గుర్తించారు. కూల్‌డ్రింక్ సీసాలు, వస్త్రాల తయారీకి వాడే పీఈటీ రకం ప్లాస్టిక్ ఎక్కువగా కన్పించింది. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యాప్తికి ప్రధాన వాహకం గాలే. ప్లాస్టిక్ రేణువులు గాలి ద్వారా వేల కిలోమీటర్లు సులువుగా ప్రయాణిస్తాయి. అయితే పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్ అంటార్కిటిక్ దాకా చేరి ఉంటుందని పరిశోధకుల అంచనా. 85 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అంటార్కిటిక్ మహాసముద్ర పర్యావరణ వ్యవస్థ ప్లాస్టిక్ వల్ల బాగా దెబ్బతింటోంది. సముద్ర జీవులు ఆహారంగా భ్రమించి విషపూరిత ప్లాస్టిక్‌ను తిని మృత్యువాత పడుతున్నాయి. రొయ్యల జాతికి చెందిన క్రిల్ అనే జీవులకు ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు గమనించారు. చేపల వేట తదితరాల వల్ల కూడా సముద్రంలోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది. సముద్ర ఉపరితలంలోనే గాక అన్ని పొరల్లోనూ మైక్రో ప్లాస్టిక్ విస్తరించింది. ఉపరితలం నుంచి 6 నుంచి 11 మీటర్ల లోతులో ప్రతి చదరపు మీటర్‌కు 766 మైక్రోప్లాస్టిక్ రేణువులు కనిపించాయి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

