Dog Ice Cream: వేసవి నుంచి ఉపశమనం కోసం కుక్కలకు స్పెషల్ ఐస్ క్రీమ్.. శునకాలే డెలివరీ.. ఎక్కడంటే..

మనుషులు ఐస్‌క్రీం తినడం చూసి కుక్కలు కూడా తినాలని తహతహలాడడం మీరు తరచుగా చూసి ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, బ్రిటీష్ సూపర్ మార్కెట్ కుక్కల కోసం ప్రత్యేక ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. అది కూడా ఐస్ క్రీమ్ వాటికీ ఇష్టమైన రకరకాల రుచులలో లభిస్తుంది.

Dog Ice Cream: వేసవి నుంచి ఉపశమనం కోసం కుక్కలకు స్పెషల్ ఐస్ క్రీమ్.. శునకాలే డెలివరీ.. ఎక్కడంటే..
Dog Ice Cream
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2022 | 9:09 AM

Dog Ice Cream: పెంపుడు జంతువులలో కుక్కలది ప్రత్యేక స్థానం. అత్యంత విశ్వాసం గల కుక్కలని  కొంత తమంది మనుషుల కంటే ఎక్కువ అని భావిస్తారు. పుట్టిన, శ్రీమంతం వంటి వేడుకలతో పాటు.. ఏకంగా కొంతమంది తమ పెంపుడు కుక్కలకు ఆస్తులను కూడా రాసి ఇచ్చిన వార్తల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. ఇక తమ కుక్కకు చిన్న పాటి గాయం అయినా సరే వెంటనే తమకున్న పనులన్నీ పక్కకు పెట్టిమరీ డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. ప్రపంచంలో ఇలాంటి డాగ్ లవర్స్ చాలా మంది ఉన్నారు. పెంపుడు కుక్కల కోసం ప్రత్యేక ఇళ్లను కూడా నిర్మిస్తున్నారు. అందులో బెడ్‌లు నుండి AC వరకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, చాలా మంది ప్రజలు తమ కుక్కలకు లక్షల రూపాయల ఖరీదు చేసే దుస్తులను వేస్తారు. తినే తిండి విషయంలో కూడా స్పెషల్ కేరింగ్ తీసుకుంటారు. ఖరీదైన ఫుడ్ ని తినిపిస్తారు. అయితే కుక్కలకు మనిషి తినే ఆహారపదర్ధాలను తినడానికి ఆసక్తిని చూపిస్తాయి. మనుషులు ఐస్‌క్రీం తినడం చూసి కుక్కలు కూడా తినాలని తహతహలాడడం మీరు తరచుగా చూసి ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, బ్రిటీష్ సూపర్ మార్కెట్ కుక్కల కోసం ప్రత్యేక ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. అది కూడా ఐస్ క్రీమ్  వాటికీ ఇష్టమైన రకరకాల రుచులలో లభిస్తుంది.

వేసవి కాలంలో చల్లటి-చల్లని ఐస్ క్రీం తింటూ కొంత ఉపశమనం పొందటానికి ప్రయత్నిస్తారు. అయితే జంతువుల సంగతి ఏమిటి. అవి కూడా వేడి తాపాన్ని అనుభవిస్తాయి. కనుక వారికి కూడా కొంత ఉపశమనం కలిగించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు. ఈ ఆలోచనతో UK సూపర్ మార్కెట్ చైన్ ఆల్ డి వెనిల్లా, ఆపిల్ ఫ్లేవర్లలో ఐస్ క్రీంను విడుదల చేసింది.

ధర రూ.300 ఉంటుంది:  వెనిల్లా, ఆపిల్ ప్లేవర్స్ అంటే కుక్కలకు చాలా ఇష్టం అని నమ్మకం. అందుకే ఈ రెండు రుచులలో ప్రస్తుతం వాటి కోసం ఐస్ క్రీం ప్రారంభించబడింది. మెట్రో అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఈ ఐస్‌క్రీం  నాలుగు డబ్బాల ధర దాదాపు రూ. 300. ఒక్కో క్యాన్‌లో 110 ml ఐస్‌క్రీం ఉంటుంది. ఈ కుక్కలకు ఇష్టమైన రుచిగల ఐస్‌క్రీమ్‌ను విక్రయించడానికి సూపర్ మార్కెట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐస్‌క్రీమ్ షాప్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో కుక్కలకు స్పెషల్ ఐస్ క్రీమ్ కొనాలనుకునే వారికి సులభంగా అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరో స్పెషాలిటీ ఏమిటంటే.. కుక్కలు స్వయంగా ఐస్ క్రీం డెలివరీ చేస్తున్నాయి.  ప్రత్యేక జాకెట్ ధరించి.. ఇతర కుక్కలకు ఐస్ క్రీం డెలివరీ చేస్తున్నాయి శునకాలు. అందుకే ఈ సేవకు ‘డాగ్-లివరీ'(dog-livery) అని పేరు పెట్టారు.

మరిన్ని వైరల్ న్యూస్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే