BEL Recruitment 2022: నెలకు రూ.55,000ల జీతంతో.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

BEL Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10




పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్:
- మొదటి ఏడాది నెలకు రూ.40,000
- రెండో ఏడాది నెలకు రూ.45,000
- మూడో ఏడాది నెలకు రూ.50,000
- నాలుగో ఏడాది నెలకు రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/బీఈ లో కనీసం 55 శాతం మార్కుతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డిప్యూటీ మేనేజర్, బెల్, జలహళ్లి, బెంగళూరు-560013.
దరఖాస్తు రుసుము: రూ.400
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.