Drone Technology: డ్రోన్ టెక్నాలజీతో అదిరిపోయే కెరీర్ అవకాశాలు! పంజాబ్ ‘డ్రోన్ హబ్’లో కోర్సులు షురూ..
డ్రోన్ (Unmanned Aerial Vehicles) టెక్నాలజీ వంటి ఆటోమేటెడ్ డివైజ్‌ల తయారీపై మీకు ఆసక్తి ఉంటే.. ఆలస్యం చేయకుండా వెంటనే పంజాబ్‌లోనున్న చండీగఢ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన తొలి డ్రోన్ హబ్‌లో అడుగు..
Punjab’s First Drone Hub at Chandigarh University: ప్రస్తుత కాలంలో ఆధునిక విద్యారంగంలో డ్రోన్ టెక్నాలజీ (Drone Technology) కొత్తపుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్‌లో డ్రోన్ టెక్నాలజీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మరింది. రోబోటిక్స్, ఏరోస్పేస్, మెకాట్రానిక్స్‌ల కలయికతో ఏర్పడిందే డ్రోన్. డ్రోన్లను ప్రాథమికంగా ‘అన్‌పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు’ గా పిలుస్తారు. ఎందుకంటే డ్రోన్ల సహాయంతో మానవమాత్రులు చేయలేని లేదా సుదీర్ఘకాలంలో చేసే పనులను క్షణాల్లో చేసేయగలగడమే అందుకు కారణం. ముఖ్యంగా ప్యాకేజీ డెలివరీ, వీడియో రికార్డింగ్, సైనిక నిఘా, వినోద కార్యకలాపాలు, వాతావరణ విశ్లేషణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, అగ్నిమాపక, వ్యవసాయ కార్యకలాపాలు వంటి ఎన్నో కీలక పనులను నిర్వహించడానికి నేటి కాలంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీంతో మనదేశంలో UAV (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్) టెక్నాలజీకి ఆదరన విపరీతంగా పెరుగుతోంది. ఆటోమేటెడ్ సైన్సెస్ (Automated Sciences) రంగాల్లో కొత్త వెంచర్ల పెరుగుదల భవిష్యత్తులో రానున్న మల్టీ బిలియన్ ఇండస్ట్రీలకు శుభసూచకంగా కనిపిస్తోంది.
డ్రోన్ టెక్నాలజీ.. కెరీర్ అవకాశాలు.. వాణిజ్య ప్రపంచంలో విప్లవాత్మక పరిణామాలకు ఇండియన్ డ్రోన్ ఎకోసిస్టమ్ వేదికకానుంది. సాంకేతిక రంగంలో ఎన్నో వినూత్న అవకాశాలను సృష్టిస్తుంది. గణాంక నివేదికల ప్రకారం.. రానున్న ఏడాదిలో డ్రోన్ పరిశ్రమలో 15-20% వృద్ధిపెరగనున్నట్లు అంచనా. దీంతో పైలెట్లకు 20 శాతం ఉద్యోగావకాశాలు సృష్టిస్తుంది. ప్రతి నెలా 750 నుంచి 900 వరకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఏయే రంగాల్లో ఉపయోగపడుతుందంటే.. డ్రోన్ టెక్నాలజీ వివిధ కమర్షియల్ సెక్టార్లు అంటే అగ్రికల్చర్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, డిఫెన్స్, నిఘా, రవాణ వంటి రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించబడుతోంది. యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ (కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ) ప్రకారం.. 2026 నాటికి డ్రోన్ టెక్నాలజీ ద్వారా రూ. 200 కోట్ల ఆదాయం అర్జించనున్నట్లు తెల్పింది.
డ్రోన్ ఫ్రేమింగ్ – వర్క్ మోడల్ వైర్‌లెస్ టెక్నాలజీతోపాటు, ఫిజిక్స్ కాన్సెప్ట్‌ల సమ్మేళనంతో డ్రోన్‌లను తయారు చేయడం జరుగుతుంది. నేటి కాలంలో బహుళ అవసరాలు, ప్రయోజనాల నిమిత్తం డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. డ్రోన్ల డిజైన్ పరిమాణం సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్ లో ఉంటుంది. జీపీఎస్ సిస్టమ్ (GPS System), జాయ్‌స్టిక్‌తో డ్రోన్‌లు పనిచేస్తాయి. వీటిని వినియోగించడం కూడా చాలా సులభం. మొబైల్ ఫోన్‌లో వీడియో గేమ్ ఆడినంత సులభంగా డ్రోన్‌లను ఆపరేట్ చేయవచ్చు.
అంతేకాకుండా డ్రోన్‌ల వైర్‌లెస్ సాంకేతికత సాయంతో వినియోగదారులు రియల్ టైం యాక్టివిటీలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. వీటి యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) నిర్మాణంలో గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, కంప్లెక్స్ టెక్నాలజీలుంటాయి. వీటితో తమ పని మరింత సులువవుతుంది.
డ్రోన్ ఇండస్ట్రీ, దాని మ్యానిఫోల్డ్ అప్లికేషన్లు పలు ప్రైవేట్, ప్రభుత్వ సెక్టార్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం, పరిపాలన విభాగాలు 2020 నుంచి అధునాతన డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఆప్టిమైజ్ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీతో సర్వే ఆఫ్ విలేజెస్ (Svamitva) కింద సమగ్ర ఈ-ప్రాపర్టీ లెడ్జర్‌ను రూపొందించారు. 4 సంవత్సరాల వ్యవధిలో సుమారు 6,60,000 గ్రామాలను మ్యాపింగ్ చేయడానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
చండీగఢ్ యూనివర్సిటీలో ఏర్పాటైన తొలి డ్రోన్ ట్రైనింగ్ హబ్.. దేశంలోని టాప్ 5 యూనివర్సిటీల్లో ఒకటైన చండీగఢ్ యూనివర్సిటీ రీసెర్చ్ బేస్డ్ ఎన్విరాన్‌మెంట్‌పై దృష్టి సారిస్తోంది. పంజాబ్‌లో తొలి ‘డ్రోన్ ట్రైనింగ్ హబ్’ ఏర్పాటు చేయడం ద్వారా ఇటు ఔత్సాహిక విద్యార్ధులకు సైంటిఫిక్ ప్లాట్‌ఫాంగా మరనుంది. అటు పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల కొరతను తీర్చడానికి సంసిద్ధమవుతోంది.
డ్రోన్ (Unmanned Aerial Vehicles) టెక్నాలజీ వంటి ఆటోమేటెడ్ డివైజ్‌ల తయారీపై మీకు ఆసక్తి ఉంటే.. ఆలస్యం చేయకుండా వెంటనే పంజాబ్‌లోనున్న చండీగఢ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన తొలి డ్రోన్ హబ్‌లో అడుగు పెట్టండి. మీ కలలను నిజం చేసుకోండి..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.