DC Vs LSG: ఏం ఫీలుంది మావా.! లక్నో ఓనర్‌కు వడ్డీతో సహా ఇచ్చిపడేశాడుగా.. దెబ్బకు చుక్కలు కనిపించాయ్
ఏం ఫీలుంది మావా.. లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆఖరిలో సంజయ్ గోయెంకా, రాహుల్ ఇద్దరూ కలిశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

మంగళవారం ఢిల్లీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ యాంకర్ రోల్ పోషించాడు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తన పాత జట్టుపై కెఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో అదరగొట్టడమే కాదు.. ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ తర్వాత కెఎల్ రాహుల్, లక్నో ఓనర్ సంజయ్గోయెంకాతో షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో లక్నో, ఢిల్లీ మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా.. రెండింటిలోనూ ఢిల్లీ అద్భుత విజయాలు అందుకుంది.
ఇక లక్నోతో ఢిల్లీ మ్యాచ్ మొదలు కాకముందే.. అందరి దృష్టి కెఎల్ రాహుల్, గోయెంకాలపైనే పడింది. గత సీజన్‌లో ఇద్దరూ కొన్ని పరిణామాల కారణంగా వైరల్ కాగా.. ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఎదురుపడితే ఏం జరుగుతుందని ఫ్యాన్స్ అందరిలోనూ ఆసక్తి కలిగింది. గత సీజన్‌లో కెఎల్ రాహుల్ లక్నోకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక వరుస ఓటముల కారణంగా గోయెంకా.. రాహుల్‌ను లైవ్‌లోనే తిట్టిపోశాడు. ఇక ఇప్పుడు క్యాపిటల్స్‌లో రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడు. లక్నో సొంతగడ్డపైనే రాహుల్.. తన పాత జట్టుపై అర్ధ సెంచరీతో పగ తీర్చుకున్నాడు.
కాగా, గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో లక్నో యజమాని గోయెంకా.. రాహుల్‌ను మైదానంలోనే తిట్టాడు. దీని తర్వాత ఇద్దరి మధ్య కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం.. ఆ తర్వాత రాహుల్ లక్నో జట్టు నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇక మెగా వేలంలో రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వరుసగా రాణిస్తూ.. జట్టును విజయపధంలో నడిపిస్తున్నాడు.
KL Rahul walking away from Goenka 😭😭😭😭
Absolute Cinema ❤️🥵🥵#LSGvsDC #KLRahulpic.twitter.com/28QpmZnBJR
— Pan India Review (@PanIndiaReview) April 22, 2025




