Andhra Pradesh: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జాబితా ప్రకారం ఇంటర్వ్యూల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

గ్రూప్ - 1 పేపర్ల కరెక్షన్ లో లోపాలున్నాయంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గ్రూప్-1 ఇంటర్య్వూల కొనసాగింపు, నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

Andhra Pradesh: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జాబితా ప్రకారం ఇంటర్వ్యూల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
High Court
Follow us

|

Updated on: Jun 15, 2022 | 2:39 PM

గ్రూప్ – 1 పేపర్ల కరెక్షన్ లో లోపాలున్నాయంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గ్రూప్-1 ఇంటర్య్వూల కొనసాగింపు, నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీకౌంటింగ్ మాత్రమే ఉంది. రీ- వేల్యుయేషన్ గ్రూప్-1 లో లేదని ఏపీపీఎస్సీ(APPSC) న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కరెక్షన్ లో లోపాలు లేవని తెలిపారు. వాదోపవాదనలు విన్న తర్వాత.. ఇచ్చిన జాబితా ప్రకారమే ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నియామకాలు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని వెల్లడించింది. సమాధాన పత్రాలు, పిటిషనర్ల మార్కుల జాబితా సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

గతంలో.. గ్రూప్ -1 ప్రధాన పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రశ్న పత్రాలను థర్డ్ పార్టీ తయారు చేసిందని తెలిపారు. మూల్యాంకనం కూడా థర్డ్ పార్టీ చేసిందని, ఈ నేపథ్యంలో పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం..తదుపరి చర్యలంటినీ నిలుపుదల చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.

ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన