Liquor Bottles: ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండె గుభేల్.. వందల సంఖ్యలో రోడ్డుపై బాటిల్స్..
Liquor Bottles: నోట్లోకి చేరాల్సిన మందు నేల పాలయ్యిందుకు రెడీ అవుతోందని తెలిస్తే మందుబాబులు నిజంగానే గుండెలు బాదుకుంటారు. ఆ బాధలో ఎంత తాగుతారో వారికే అర్ధంకాదు. అలాఉంటుందా పరిస్థితి. కుప్పలు కుప్పలుగా కాదు గుట్టలు గుట్టులుగా మద్యం బాటిల్స్ వరుసగా..
ప్రకాశం జిల్లాలో ఆ సీన్ చూస్తే నిజంగానే మందుబాబుల గుండె గుభేల్‌మంటుంది. నోట్లోకి చేరాల్సిన మందు నేల పాలయ్యిందుకు రెడీ అవుతోందని తెలిస్తే మందుబాబులు నిజంగానే గుండెలు బాదుకుంటారు. ఆ బాధలో ఎంత తాగుతారో వారికే అర్ధంకాదు. అలా ఉంటుందా పరిస్థితి. కుప్పలు కుప్పలుగా కాదు గుట్టలు గుట్టులుగా మద్యం బాటిల్స్ వరుసగా పెట్టారు. కాసేపట్లో వాటిపై నుంచి రోడ్డు రోలర్ నడిపేందుకు ఆ జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో( ఎస్ ఇ బి) అధికారులు సిద్దమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అక్రమ మద్యం అరికట్టించేందుకు ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసింది. సెబ్ సాయంతో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. పోలీసుల వరుస దాడులతో భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఈ మద్యాన్ని అందరి ముందే ధ్వంసం చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా (Ongol District) లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ మొత్తం మద్యంను రోడ్డు రోలర్ (road roller)తో తొక్కించి ధ్వంసం చేయనున్నారు అధికారులు. ఇందులో 42 వేల మద్యం బాటిళ్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు లక్ష్యల్లో ఉంటుందని అంచనా వేస్తు్న్నారు.