Great resignation: కంపెనీలకు షాకిస్తున్న ఉద్యోగులు! వచ్చే 6 నెలల్లో 86 శాతం ఉద్యోగుల రాజీనామా.. అసలు కారణం ఇదే..
కోవిడ్ తగ్గుముఖంపట్టినా భారత్‌లో గ్రేట్ రిజిగ్నేషన్ (great resignation) ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న 6 నెలల్లో ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 86 శాతం మంది ఎంప్లాయిస్ తమ ఉద్యోగాలకు రాజీనామా చేయనున్నట్లు..
Great resignation in India 2022: కోవిడ్ తగ్గుముఖంపట్టినా భారత్‌లో గ్రేట్ రిజిగ్నేషన్ (great resignation) ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న 6 నెలల్లో ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 86 శాతం మంది ఎంప్లాయిస్ తమ ఉద్యోగాలకు రాజీనామా చేయనున్నట్లు జాబ్స్ అండ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మైఖెల్ పేజ్ నివేదిక పేర్కొంది. గత రెండేళ్లుగా (కరోనా ప్రారంభం నుంచి) ఉద్యోగుల రాజీనామాలు కొనసాగుతున్నా 2022లో రాజీనామాలు వేగం పుంజుకున్నట్లు నివేదికలో తెల్పింది. మార్కెట్లు, ఇండస్ట్రీలు ఇతర కంపెనీల (IT Compenies)పై దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు, 2022లో రాజీనామాల వెల్లువ ఆగే సంకేతాలు కనిపించడంలేదని తెలిపింది. రాబోయే రోజుల్లో ఉద్యోగులు భారీగా వలసపోయే అవకాశం ఉందని తెల్పింది. పని భారం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత దెబ్బతినడం అందుకు ప్రధాన కారణమని వెల్లడించింది.
నివేదిక ప్రకారం.. వర్క్ అరేంజ్‌మెంట్స్ (వర్క్ ఫ్రం హోమ్,హైబ్రిడ్ ఇతర విధానాలు), కోవిడ్ రిలేటెడ్ పాలసీలు ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించినట్టు నివేదించారు. 11 శాతం ఉద్యోగులు (రాజీనామా చేసిన లేదా చేయాలనుకుంటున్న) ఈ కారణం చేతనే తమ ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలిపారు. 61 శాతం మంది ఉద్యోగులు తక్కువ జీతానికి పనిచేస్తున్నట్లు, అధిక జీతం/ప్రమోషన్, బెటర్ వర్క్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఐతే ఉద్యోగాలను వదులుకోవడానికి గల ప్రధాన కారణాల్లో.. కెరీర్ పురోగతి, అధిక జీతం, ఉద్యోగ సంతృప్తి (job satisfaction), ఉద్యోగంలో మార్పు కోరుకోవడం మేజర్ రోల్ పాటిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కంపెనీ బ్రాండ్ కన్నా నచ్చిన కంపెనీలో మెచ్చిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.