Pahalgam Attack: ముందు మేము భారతీయులం.. తరువాత కాశ్మీరీలం..ఉగ్రదాడికి నిరసనగా నేడు కాశ్మీర్‌లో బంద్.. కొవ్వొత్తుల ర్యాలీ..
ప్రశాంతంగా ఉన్న చోట రక్తం పాతంతో కల్లోలం సృష్టించారు ఉగ్రవాదులు. దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఈ దుశ్చర్యని ఖండిస్తోంది. అంతేకాదు ఈ ఘటనపై కశ్మీర్ వాసులు స్పందిస్తూ ముందుగా మేము భారతీయులం.. తర్వాత కాశ్మీరీలం అంటున్నారు. స్థానిక ప్రజలు ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడిని ఖండిస్తూ బంద్ ప్రకటించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనతో కాశ్మీరీ ప్రజలు చాలా విచారంగా.. కోపంగా ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని అందమైన కొండ ప్రాంతం పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ముందుగా పర్యాటకులను మతం గురించి అడిగిన తర్వాత వారిని కాల్చి చంపారు. చంపడానికి ముందు ఉగ్రవాదులు పర్యాటకులను కల్మాని చదవమని అడిగారు. ఉగ్రవాదుల బుల్లెట్లకు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. భూలోక స్వర్గంగా పిలువబడే కాశ్మీర్‌లో.. ఉగ్రవాదులు క్షణంలో నరకం లాంటి పరిస్థితులను సృష్టించారు. ఈ దాడికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమై నిరసన తెలుపుతోంది. దాడి తర్వాత కాశ్మీరీలు దుఃఖంలో, కోపంలో ఉన్నారు. తమ అతిథులపై చేసిన దాడికి వారు చింతిస్తున్నారు.
కశ్మీరీలు ఏకమై ఈ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించారు. ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దుష్ట చర్యతో స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉగ్రవాద దాడికి నిరసనగా కశ్మీర్‌లోని మసీదుల నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఖారీ మంజూర్ ఖాస్మీ కిష్త్వార్ బంద్‌కు పిలుపునిచ్చారు. మర్కాజీ షురా బుధవారం కాశ్మీర్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ దాడికి వ్యతిరేకంగా కశ్మీరీ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇక్కడి ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రభుత్వం ఉగ్రవాదులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న కశ్మీరీలు
అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ నుంచి మొత్తం కశ్మీర్ ప్రాంతం వరకు ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. మసీదుల ఇమామ్‌లు లౌడ్‌స్పీకర్ల ద్వారా ఉగ్రవాదులు ఇస్లాం, కశ్మీరులకు శత్రువులు అని ప్రకటిస్తున్నారు. మంగళవారం దాడి తర్వాత దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం కాశ్మీర్ బంద్ పాటించాలని కశ్మీర్‌లోని చాలా మసీదుల నుంచి విజ్ఞప్తి వచ్చింది.
కశ్మీర్‌లోని మసీదుల నుంచి ప్రకటన
కిష్త్వార్‌లోని మసీదు నుంచి “పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదం పేరుతో ప్రజలు చంపబడ్డారు. మొత్తం ఇస్లామియా దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దోషులు ఎవరైనా వారిని కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి నిరసనగా కిష్త్వార్ బుధవారం బంద్ పాటించనున్నామని ప్రకటించింది.
ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
VIDEO | J&K: Locals of Pahalgam hold candle march for terror attack victims demanding justice.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/F19rAK7tFf
— Press Trust of India (@PTI_News) April 22, 2025
“ముందుగా మేము భారతదేశ నివాసులం, తరువాత కాశ్మీరీలం.”
మంగళవారం రాత్రి జరిగిన దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు అనంత్‌నాగ్, పహల్గామ్, కుప్వారా, బారాముల్లా, బండిపోరా, పుల్వామా, బుద్గామ్, షోపియన్, శ్రీనగర్‌లలో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. అంతేకాదు ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పహల్గామ్ స్థానికులు కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించారు. ఈరోజు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని పిరికి చర్య అని.. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని అన్నారు. ముందుగా మేము భారతదేశ నివాసులం, తరువాత కాశ్మీరీలం” అని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




