AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరిలో పెళ్లి.. హనీమూన్‌కి కశ్మీర్ వెళ్ళిన దంపతులు.. భర్త తలపై నేరుగా కాల్చిన చంపిన ఉగ్రవాదులు

ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో మరణించాడు. మృతు శుభం ద్వివేదిగా గుర్తించారు. శుభం ద్వివేది వివాహం ఫిబ్రవరిలో జరిగింది. తన భార్యతో కలిసి హనీమూన్ కోసం జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లాడు. అయితే పహల్గామ్‌లో పర్యాటకులే లక్ష్యం జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించాడు.

ఫిబ్రవరిలో పెళ్లి.. హనీమూన్‌కి కశ్మీర్ వెళ్ళిన దంపతులు.. భర్త తలపై నేరుగా కాల్చిన చంపిన ఉగ్రవాదులు
Shubham Dwivedi
Surya Kala
|

Updated on: Apr 23, 2025 | 10:13 AM

Share

మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో దేశం ఒక్కసారిగా ఉల్కి పడింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని అనేక కుటుంబాలలో దుఃఖం ముంచెత్తింది. ఈ దాడిలో మరణించిన పౌరులలో నూతన వరుడు శుభం ద్వివేది కూడా ఉన్నాడు. అతను తన భార్యతో కలిసి హనీమూన్ కోసం కాశ్మీర్‌కు వెళ్లాడు. శుభం ఫిబ్రవరి 12, 2025న వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రెండు నెలల్లోనే శుభం జీవితం విషాదకరంగా ముగిసింది. అతని భార్య జీవితంలో హనీమూన్ ఒక పీడకలగా మారింది.

ANI తో శుభం ద్వివేది బంధువు సౌరభ్ ద్వివేది మాట్లాడుతూ.. ఉగ్రవాది వ్యక్తుల పేర్లు అడిగిన తర్వాత కాల్పులు ప్రారంభించరని చెప్పారు. పేరు అడిగి మరీ శుభం తలపై నేరుగా కాల్చి చంపారని ఆరోపించాడు . అంతేకాదు శుభం ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి పహల్గామ్‌కి వెళ్ళినట్లు చెప్పాడు. భర్తని కాల్చి చంపిన వెంటనే శుభం భార్య..తన మామకు ఫోన్ చేసి.. శుభం తలపై కాల్చి ఉగ్రవాదులు చంపెసినట్లు చెప్పింది. వ్యక్తుల పేర్లు అడిగిన తర్వాత కాల్పులు ప్రారంభించారని ఇలా అందరి పేర్లు అడిగిన తర్వాత మాత్రమే కాల్పులు చేసినట్లు శుభం బార్య వివరించిందట. ఈ దాడిలో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నేపాల్ కి చెందిన పర్యాటకులు ఉన్నారు.

బిజెపి ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ ఈ దాడిని ఖండించారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన విషాదకరమైన భయంకరమైన దాడిగా అభివర్ణించారు. మహా రాష్ట్ర న్యూ పన్వేల్ నివాసి దిలీప్ దేసాలే కాల్పుల్లో మరణించారు…” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడులలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాది ఒకటిగా నిలుస్తుంది. ఈ దారుణమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ విదేశీ దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనలో ఉండగా, శ్రీమతి సీతారామన్ అమెరికా , పెరూలకు అధికారిక పర్యటనలో ఉన్నారు. భారత్ కు తిరిగి వచ్చిన ప్రధాని మోడీ కీలక అధికారులతో సమవేశం అయ్యారు.

ఈ దాడిలో అనేక మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కర్నాల్‌కు చెందిన యువ భారత నావికాదళ అధికారి.. ఇటీవలే వివాహం చేసుకున్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఒడిశాకు చెందిన అకౌంట్స్ ఆఫీసర్ ప్రశాంత్ సత్పతి, సూరత్‌కు చెందిన శైలేష్ కడాటియా ఉన్నారు.

ఈ దాడిలో ప్రశాంత్ మరణించాడు, అతని భార్య. చిన్న కొడుకు గురించి అతని కుటుంబానికి ఎటువంటి సమాచారం లేదు. ప్రశాంత్ తన భార్య, కొడుకుతో కలిసి జమ్మూ కాశ్మీర్‌కు సెలవుల్లో గడిపేందుకు వెళ్ళాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..