AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hatha Jodi: ఈ మొక్క వేరు చాముండీ దేవి ప్రతి రూపం.. పేదవాడిని ధనవంతుడిగా మార్చే మొక్క ఏమిటో తెలుసా..

హత జోడి ప్రభావం అద్భుతమైనది. దీనిని చాముండి దేవి అవతారంగా భావిస్తారు. ఇది అరుదైన మొక్క. దీనిని కనుగొనడం అంత సులభం కాదు. దీని అద్భుత నివారణలు తంత్ర-మంత్రం, జ్యోతిషశాస్త్రం అనే మూడింటిలోనూ వివరించబడ్డాయి. దీన్ని పొందిన వారు ఖచ్చితంగా ప్రభావవంతమైనవారు అవుతారు. ఎవరికైనా ఈ హత జోడీ మొక్క వేరు ఉన్నవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వారిని ధనవంతులు కాకుండా ఎవరూ ఆపలేరు!

Hatha Jodi: ఈ మొక్క వేరు చాముండీ దేవి ప్రతి రూపం.. పేదవాడిని ధనవంతుడిగా మార్చే మొక్క ఏమిటో తెలుసా..
Hatha Jodi
Surya Kala
|

Updated on: Apr 23, 2025 | 8:58 AM

Share

హత జోడి పేరులో ఉన్నట్లు రెండు చేతుల జత. అంటే హతజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క వేరు. హత జోడి అనేది తంత్రం, మంత్రాలలో ఉపయోగించే అరుదైన వస్తువు, ఇది ఎవరి దగ్గర ఉంటే వారు ధనవంతులు అవుతారని నమ్మకం. ఈ హత జోడి వేరు ఉన్న వ్యక్తి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ హత జోడి వేరు దొరకడం చాలా అరుదు. హత జోడి అనేది మధ్యప్రదేశ్‌లోని దట్టమైన అడవులలో, అమర్ కంటక్ కొండలలో కనిపించే అరుదైన చెట్టు వేరు. ఈ వేరు నేపాల్‌లోని అమర్‌కంటక్ పర్వతాలు, లుంబినీ నది అడవులలో కూడా కనిపిస్తుంది. ఇది కనిపించడం చాలా అరుదు అని నమ్ముతారు. ఇది ఒక ప్రత్యేక రకమైన చెట్టు వేరు, దీనిని తవ్వినప్పుడు ముందు నుంచి రెండు చేతులు కలిపిన పిడికిలిలా కనిపిస్తుంది.

తంత్ర-మంత్రం జ్యోతిషశాస్త్రంలో ప్రభావవంతంగా

హఠ జోడిని హత జోడి , బిర్వా వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ అరుదైన మొక్క వేరు మహాకాళి, కామాఖ్య, చాముండి దేవిల రూపమని.. దీనిని ఎవరు పొందితే వారి కష్టాలన్నీ పరిష్కారమవుతాయని నమ్ముతారు. దీనిని చాముండి దేవి అవతారంగా భావిస్తారు. దీని వద్ద అసాధారణ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. దేశంలోని ప్రసిద్ధ జ్యోతిష్కులు కూడా దీనిని ఉపయోగిస్తారు. అంతేకాదు ఇది తంత్ర అభ్యాసకులకు కూడా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఇది అనేక తాంత్రిక ఆచారాలలో కూడా ఉపయోగించబడుతుంది.

హత జోడిని ఎలా భద్ర పరచాలంటే

  1. హత జోడిని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత.. ఆదివారం రోజున దానిని శుభ్రమైన నీటితో కడిగి, ఎర్రటి వస్త్రం మీద ఉంచండి.
  2. దీని తరువాత.. ఒక గిన్నెలో ముడి నువ్వుల నూనె తీసుకొని, హఠ జోడిని ఆ నూనెలో వేసి ముంచండి.
  3. నూనె గిన్నెను ఎవరు చూడని ప్రదేశంలో పెట్టి.. అలా 12 నుంచి 15 రోజులు నూనెలో ఉంచండి.
  4. 15 రోజుల తర్వాత.. హత వేరుని నూనె నుంచి తీసి ఎర్రటి గుడ్డపై ఉంచండి.
  5. దీని తరువాత కుంకుమ, బియ్యం, యాలకులు, లవంగాలు వేసి ఎర్రటి వస్త్రంలో వేసి వేరుని వేసి కట్టండి
  6. వీలైతే, దానిని వెండి పెట్టెలో ఉంచండి.. అది సాధ్యం కాకపోతే.. దానిలో చిన్న వెండి ముక్క ఉంచండి.
  7. చాముండీ మాత మంత్రాలను రోజూ జపించండి. మీ వద్ద భద్రంగా ఉంచుకోండి.

హత జోడి చాముండీ దేవి చిహ్నం

హత జోడిని చాముండి దేవి అవతారంగా భావిస్తారు. సిద్ధ హత జోడికి మాతృదేవతకి ఉన్న అపారమైన శక్తులు ఉన్నాయని చెబుతారు. సిద్ధ హఠ జోడి ఒక అద్భుతమైన వస్తువు. దీని ప్రభావాలు అమోఘం. దీనిని ప్రతిరోజూ పూజించడం, చూడటం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎవరైనా హఠ జోడిని పూజించడంలో ప్రావీణ్యం సంపాదించినట్లయితే, వారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. ఈ వేరు ఒక పేదవాడిని కూడా ధనవంతుడిని చేస్తుంది. అయితే వేరొకరు ఉపయోగించే హఠ జోడి మీకు అంత ప్రభావవంతంగా పనిచేయదు. దీనిని స్వయంగా పూజించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు