AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు చెడు ప్రభావం మీపై ఉందేమో చెక్ చేసుకోండి..

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో రాహువు అశుభంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి. రాహువు అనేక సంకేతాల ద్వారా తన రాకను ప్రకటిస్తాడు. అటువంటి పరిస్థితిలో ఈ సంకేతాలను సకాలంలో గుర్తించి రాహువుకి సంబంధించిన అశుభ ప్రభావాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం.

మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు చెడు ప్రభావం మీపై ఉందేమో చెక్ చేసుకోండి..
Effects Of Inauspicious Rahu
Surya Kala
|

Updated on: Apr 23, 2025 | 7:21 AM

Share

జ్యోతిషశాస్త్రంలో రాహువుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని నీడ గ్రహం లేదా అశుభ ఫలితాలను ఇచ్చే గ్రహం అని పిలుస్తారు, దీనిని అంతుచిక్కని గ్రహం అని కూడా పిలుస్తారు ఎందుకంటే రాహువు అశుభ ఫలితాలను ఇవ్వబోతున్నప్పుడు.. ఆ వ్యక్తి శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలలో చిక్కుకుంటాడు. ఎవరి జాతకంలోనైనా రాహు దోషం ఉంటే వారి జీవితంలో గందరగోళం ఉంటుంది. అనేక సంఘటనలు జరుగుతాయి, రాహువు తన రాకకు అనేక సంకేతాలను ఇస్తాడు. ఈ సంకేతాలను అర్థం చేసుకున్న తర్వాత మనం రాహువు అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం. రాహువు మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఈ 18 సంవత్సరాలలో రాహువు శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు. రాహువు శుభప్రదమైతే అది ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక పరంగా నడిచేలా చేస్తుంది. అది అశుభకరమైతే అది అతని జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. మన జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉన్నాడు అని తెలుసుకోవడానికి జీవితంలో వస్తున్న కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుంది.

రాహువు అశుభ సంకేతాలు! అకస్మాత్తుగా సమస్యలు రావడం

  1. రాహువు అశుభ ప్రభావాల కారణంగా.. బాధితుడి జీవితంలో అకస్మాత్తుగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు అతన్ని శారీరక, మానసిక , ఆర్థిక అనే మూడు కోణాల నుంచి చుట్టుముడతాయి.
  2. ఆరోగ్య సమస్యలు: రాహువు అశుభంగా ఉన్నప్పుడు.. కడుపుకి సంబంధించిన సమస్యలతో పాటు తలనొప్పి సహా అనేక ఇతర వ్యాధులతో ఇబ్బంది పడతారు.
  3. నిద్ర లేకపోవడం: రాహువుతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటాడు.
  4. చెడు కలలు కనడం: రాహువు ప్రభావానికి ఒక సంకేతం ఏమిటంటే ఆ వ్యక్తికి పీడకలలు రావడం ప్రారంభమవుతాయి. అలాంటి వ్యక్తి కలలో భయపడతాడు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఒత్తిడి- నిరాశ: రాహువు అశుభ ప్రభావం కారణంగా.. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ చిరాకు, నిరాశ, ఆందోళన, ఒత్తిడి , విచారంతో జీవిస్తాడు.
  7. సంబంధాల క్షీణత: రాహువు కుటుంబంలో కలహాలను సృష్టిస్తాడు, భార్యాభర్తల మధ్య కలహాలతో పాటు సన్నిహిత సంబంధాలలో విబేధాలు చోటు చేసుకుంటాయి.
  8. ఆర్థిక నష్టం: రాహువు అశుభ ప్రభావాల వల్ల.. ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు. ఇతర ఆర్థిక నష్టాలను కూడా భరించాల్సి రావచ్చు.
  9. పనిలో ఆటంకాలు: రాహువు అశుభ స్థానంలో ఉన్నట్లు అయితే, ఉద్యోగం , వ్యాపారం రెండింటిలోనూ వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని గమనించాలి.
  10. బద్ధకంతో ఇబ్బంది: రాహువు ప్రభావం వల్ల వ్యక్తి బద్ధకంగా ఉంటాడు. భ్రాంతికి గురవుతాడు. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ నిరుత్సాహంగా,గందరగోళంగా ఉంటాడు.
  11. పదే పదే సందేహించడం: రాహువు అశుభ ప్రభావం కారణంగా.. ఒక వ్యక్తి అపార్థాలలోకి జారుకుంటాడు. అందరినీ అనుమానించడం ప్రారంభిస్తాడు.
  12. వాహన ప్రమాద కారకం: రాహువు అశుభంగా ఉండటం వల్ల వాహన ప్రమాదాలు కూడా సంభవించవచ్చు.
  13. ఎలక్ట్రానిక్ పరికరాలు అకస్మాత్తుగా పాడైపోవడం: ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు రాహువుతో అనుసంధానించబడినవిగా పరిగణించబడతాయి. ఇంట్లోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అకస్మాత్తుగా పనిచేయకపోతే, దానిని రాహువు అశుభ సంకేతంగా పరిగణించాలి.
  14. జుట్టు, గోర్లు దెబ్బతినడం: రాహువు ప్రభావం వల్ల జుట్టు రాలడం, గోళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
  15. ఇంటికి పగుళ్ళు: రాహువు ఆశుభాన్ని కలిగిస్తాడు అనడానికి మరో సంకేతం ఏమిటంటే.. ఇలాంటి వ్యక్తులు నివసించే వారి ఇళ్ళు తడిగా ఉండటం, పగుళ్లు ఏర్పడటం , ఇంట్లో వింత వాసన వస్తుంది.

ఈ సంకేతాలు కనిపిస్తే రాహువు అనుగ్రహం కోసం పండితులు సూచించిన కొన్ని పరిహారాలు చేసి చూడండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు