AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangal Gochar: కర్కాటక రాశిలో కుజ సంచారం.. తులా రాశి సహా ఏ రాశివారు ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటారో తెలుసా..

జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు ముఖ్యమైన స్థానం ఉంది. నవ గ్రహాల్లో అంగారకుడు ఒక గ్రహం. ఈ గ్రహానికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా అరుణ గ్రహం అని కూడా అంటారు. అయితే త్వరలో కుజుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. మరొకొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది? ఏ రాశికి ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం..

Mangal Gochar: కర్కాటక రాశిలో కుజ సంచారం.. తులా రాశి సహా ఏ రాశివారు ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటారో తెలుసా..
Kujudu
Surya Kala
|

Updated on: Apr 23, 2025 | 1:23 PM

Share

హిందూ మతంలో రాశుల్లో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహాల సంచారము వలన కొన్ని రాశుల వారికి లాభం కలుగుతుంది. మరి కొన్ని రాశుల వారికి జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సంచార వాస్తవ ప్రభావం ఏ వ్యక్తిపైనా వారి వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థానం, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా కుజుడు స్థానం ఇప్పటికే బలహీనంగా లేదా ప్రతికూలంగా ఉంటే.. ఈ సంచార సమయంలో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం రోజున కొన్ని దానాలు చేయడం, కుజకి సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల కుజ సంచార ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరం కుజుడు ఏప్రిల్ 3వ తేదీ గురువారం కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 7వ తేదీ శనివారం తెల్లవారుజామున 02:28 గంటల వరకు ఈ రాశిలోనే ఉంటాడు. కర్కాటక రాశి చంద్రునిచే పాలించబడే నీటి రాశి. అయితే కుజుడు అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో కర్కాటక రాశిని అంగారక గ్రహాన్నీ నీచ రాశిగా పరిగణిస్తారు. కనుక ఈ సంచార ప్రభావం కొన్ని రాశుల వారికి ముఖ్యమైనది కావచ్చు. వివిధ రాశులపై కర్కాటక రాశిలో కుజ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం..

ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

  1. మేష రాశి: ఈ రాశి వారి పనిలో విజయం లభించే అవకాశం ఉంది. కొన్ని స్థిర, చరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అమ్మవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించవచ్చు, ఇది కొంత ఆందోళనకు కారణమవుతుంది.
  2. వృషభ రాశి: వీరి ధైర్యం పెరుగుతుంది. నివాసం లేదా పని ప్రదేశంలో మార్పు ఉండవచ్చు. పని రంగంలో పోరాటంతో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇది మనసుకు శాంతిని ఇస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మిథున రాశి: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. గౌరవానికి కూడా హాని కలుగుతుంది.
  5. కర్కాటక రాశి: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో సంబంధాలలో సమస్యలను ఎదుర్కొంటారు. వీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.
  6. సింహ రాశి: వీరికి మరమ్మతు పనుల ఖర్చులు పెరగవచ్చు. అంతేకాదు ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులతో విభేదాలు ఉండవచ్చు. కుటుంబంలో అశాంతి నెలకొనవచ్చు.
  7. కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. గతంలో ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి కావడం ప్రారంభమవుతుంది. వీరి కెరీర్‌లో చాలా పురోగతి ఉంటుంది. వీరు చేసిన కొన్ని పాత పనులకు గౌరవం లభిస్తుంది.
  8. తుల రాశి: వీరు తమ నివాసం లేదా కార్యాలయాన్ని మార్చవలసి రావచ్చు. దీని కారణంగా ఖర్చులు కూడా పెరగవచ్చు. వీరు కొత్త వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.
  9. వృశ్చిక రాశి: వీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఎదురుకావచ్చు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. అన్ని పనులలో అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు.
  10. ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు పని పూర్తి చేయాలంటే కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా అడ్డంకులు ఎదురుకావచ్చు. పనిలో అడ్డంకులు ఉండవచ్చు, దీని కారణంగా మనస్సు నిరాశకు గురవుతుంది.
  11. మకర రాశి: వీరు కొత్త పనులలో పెట్టుబడి పెట్టవచ్చు. కొన్ని పాత సంబంధాలలో ఉద్రిక్తత పెరగవచ్చు. గౌరవం పెరిగే అవకాశం ఉంది. వీరికి కొత్తగా కొన్ని బాధ్యతలు కూడా లభించవచ్చు.
  12. కుంభ రాశి: కుటుంబంలో వివాదాలు ఏర్పడవచ్చు. అయితే చేపట్టిన పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
  13. మీన రాశి: కష్టపడి పని చేసిన తర్వాతే తమ పనిలో విజయం సాధిస్తారు. ఆఫీసులో చాలా పురోగతి సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. గతంలో చేసిన పనికి తగిన గౌరవం పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు