Pahalgam Attack: ఉగ్రదాడితో కశ్మీర్ పర్యాటకంపై సంక్షోభ మేఘాలు.. ప్రశ్నార్థకంగా లక్షలాది మంది జీవనోపాధి
ప్రశాంతంగా ఉన్న కశ్మీరం మంగళవారం జరిగిన ఉద్ర దాడితో ఒక్కసారిగా ఉల్కిపడింది. ధవళ వర్ణంతో మెరిసిపోయే ప్రాంతం ఒక్కసారిగా రుధిర వర్ణం దాల్చింది. పర్యాటకులపై కాల్పులతో ఒక్కసారిగా జమ్ము కాశ్మీర్ సహా దేశం మొత్తం ఉల్కిపడింది. అయితే ప్రతి సంవత్సరం శ్రీనగర్‌ను కోట్లాది మంది పర్యటిస్తారు. అసలు ఆ ప్రాంత వాసులకు ఆదయ వనరు పర్యాటక రంగమే.. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు జరిగిన ఉగ్రదాది స్థానిక పర్యాటక రంగంపై, ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..

మరోసారి ఉగ్రవాదం కశ్మీర్ భూమిని రక్తసిక్తం చేసింది. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన తాజా ఉగ్రవాద దాడి అమాయక పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ఇది కశ్మీర్ సాంస్కృతిక వారసత్వం, దాని ఆత్మ , లక్షలాది కశ్మీరీల జీవనోపాధిపై ప్రత్యక్ష దాడిగా పర్యాటక రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది పర్యాటకులు శ్రీనగర్‌ను సందర్శిస్తారు. శ్రీనగర్, కశ్మీర్ వాసులకు ఈ పర్యాటకులే ఆదాయ వనరులు. అటువంటి పరిస్థితిలో ప్రతి సంవత్సరం ఎంత మంది పర్యాటకులు శ్రీనగర్‌ను సందర్శిస్తారు. అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు తోడ్పడతారో తెలుసుకుందాం..
కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం
భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్‌లో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన పర్యాటక పరిశ్రమ ఉంది. ఇది రాష్ట్ర GDPకి 7-8 శాతం దోహదపడుతుంది. 2030 నాటికి ఇది రూ. 25,000 నుంచి 30,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే ఇప్పుడు జరిగిన ఉగ్రదాడితో అక్కడ జరిగే అభివృద్ధి ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగించనుంది అని చెబుతున్నారు.
ప్రమాదంలో 2.5 లక్షల మంది జీవనోపాధి
కశ్మీర్‌లో హోటళ్ళు, హౌస్ బోట్లు, టాక్సీ సేవలు, గైడ్‌లు, హస్తకళలు వంటి పర్యాటక సంబంధిత కార్యకలాపాల ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. దాల్ సరస్సులో నడుస్తున్న 1,500 లకు పైగా హౌస్ బోట్లు, 3,000 పైగా హోటల్ గదులు, క్యాబ్ సర్వీసులు ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. ఉగ్ర దాడి తర్వాత హోటల్ బుకింగ్‌ను వరసగా రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ కు వెళ్ళే విమాన టిక్కెట్ల నుంచి హోటళ్ళు, టాక్సీల వరకూడా ప్రతిదీ రద్దు చేసుకుంటున్నారని సమాచారం.
గుల్మార్గ్ నుంచి దాల్ సరస్సు వరకు ప్రతిచోటా నిశ్శబ్దం.
గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్, దాల్ సరస్సు వంటి పర్యాటక ప్రదేశాలను ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. 2024 సంవత్సరంలో, 2.36 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారు. వారిలో 65,000 కంటే ఎక్కువ మంది విదేశీయులు. గుల్మార్గ్ ఒక్కటే రూ.103 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. అయితే ఇప్పుడు జరిగిన ఉగ్రదాడితో ఈ పర్యాటక కేంద్రాలన్నీ భయం, అనిశ్చితి నీడలో ఉన్నాయి.
కశ్మీర్ పర్యాటకులకు మాత్రమే కాదు సినీ పరిశ్రమకు, OTT నిర్మాతలకు ఇష్టమైన షూటింగ్ గమ్యస్థానంగా కూడా ఉంది. అంతే కాదు డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పెరుగుతున్న డిమాండ్ కూడా పర్యాటకానికి ఊతం ఇచ్చింది. అయితే ఇప్పుడు సినిమా యూనిట్లు, వెడ్డింగ్ ప్లానర్లు వెనక్కి తగ్గడం ప్రారంభించారు.
వికాస్ వాహనానికి బ్రేకులు వేసిన ఉగ్ర దాడి
కశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ప్రణాళిక వేసింది. విమాన కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నారు. వందే భారత్ రైలు ప్రారంభించబోతున్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఆన్-అరైవల్ వీసా వంటి పథకాలను ప్రవేశపెడుతున్నారు. 75 కొత్త పర్యాటక ప్రదేశాలు, వారసత్వ, ఆధ్యాత్మిక పరమైన ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉగ్రవాద చర్యతో ఈ ప్రయత్నాలన్నింటిపై నీలి నీడలు అమలుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








