Sita Devi Temple: ఏపీలో సీతమ్మకు ప్రత్యేకంగా ఆలయం ఉందని తెలుసా..! బాలిక రూపంలో పూజలు అందుకుంటున్న సీతమ్మ
ప్రత్యేకంగా సీతా దేవిని కొలవటం ఆమెకు పూజలు చేయటం , వ్రతం ఆచరించే ఆలయం బహు అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో సీతాదేవి ఆలయాలున్నాయి అని కూడా భక్తులకు తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఏపీలో సీతాదేవి ఆలయం ఉందని తెలుసా..

భారతీయులకు శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. సీతా దేవి ఆయన ధర్మపత్నిగా పూజలందుకుంటుంది. రామ మందిరాలు, రామాలయాలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి పూజలందుకుంటూ కనిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రామాలయం లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. రామాలయంలో ఆదర్శ దంపతులైన సీతారాములతో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కూడా భక్తులతో పూజలను అందుకుంటారు. అయితే హనుమంతుడికి విడిగా ఆలయాలు కనిపిస్తాయి. కానీ ఒక్క సీతాదేవిని పూజించే ఆలయాలు మాత్రం ఉంటాయని ఊహించి ఉండరు కూడా.. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వల్లూరు గ్రామంలో బాల సీత దేవికి ప్రత్యేకంగా విగ్రహం ఏర్పాటు చేసి దశాబ్ధాలుగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
సీతాదేవికి ప్రత్యేక ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే
- సీతాదేవికి ప్రత్యేకంగా ఐదు ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి.
- కేరళ రాష్ట్రంలో ని వయనాడ్ లో పచ్చని చెట్లు మధ్య ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలో సీతాదేవికి ఉన్న.. ఆలయంగా పేరుగాంచింది. శ్రీరాముడు ఆమెను అరణ్యంలో వదిలి రావాలని ఆదేశించిన తర్వాత ఆమె తన ఇద్దరు కుమార్తెలతో ఇక్కడే నివశించినట్లు పురాణం కధ. ఇక్కడ అగ్నిగుండం తో పాటు ఆమె స్నానం చేసిన చెరువు, ధ్యానం ప్రదేశం ఉన్నాయి.
- మరో ఆలయం ఉత్తరప్రదేశ్ లోని భదోహిలో ఉంది. ఇది వారణాసి కి సమీపంలో గంగానది ఒడ్డున ఉంది. రెండోసారి సీతను తన పవిత్రత నిరూపించుకోవాలని రాముడు ఆదేశించగా ఆమె భూమిలోకి ప్రవేశించిన ప్రాంతంగా ఈ చోటును భక్తులు భావిస్తుంటారు.
- బీహార్ లోని సీతామర్హి వద్ధ సీతాదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని సీత జన్మస్థలం గా కొలుస్తారు. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో , హర్యానాలోని కర్నాల్ నూ ఆమెకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి.
- సీతను లక్ష్మీ స్వరూపం ఆమె జనకమహారాజు యాగము చేసేందుకు భూమిని దున్నే సమయంలో నాగలి కి పట్టిన ఒక పెట్టెలో దొరికింది. ప్రస్తుతం నేపాల్ లో ఉన్న జనక్ పూర్ ఆమె జన్మస్థలం గా చెబుతారు.
బాల సీతకు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పూజలు
అయోధ్యలో బాలరాముడు పూజలందుకుంటున్నాడు. మరి అయోనిజ అయిన సీతా దేవిని బాలిక రూపంలో కొలిచే ఆలయంను కొన్ని దశాబ్దాల క్రితమే నిర్మించారు. పాలరాతితో నిర్మలంగా కనిపించే ఆ బాల సీతకు నిత్యం పూజాదికాలు నిర్వహిస్తారు. అంతేకాదు సీతా దేవి సంపదకు, త్యాగానికి, సహనానికి, ధైర్యానికి, నిర్మలత్వానికి ప్రతీక ఆమెకు ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరులో వ్రతం ఆచరిస్తారు. సీతాదేవి పాదాలు సైతం ఇక్కడ ఉన్నాయని స్ధానికులు చెబుతారు. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య ఉషా చిలుకూరి పూర్వికులు ఈ ఆలయానికి స్ధలం ఇచ్చారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




