AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Sun Transit: ఈ నెల 25న సూర్య గురుల కలయిక.. ఏర్పడనున్న అర్థకేంద్ర రాజ యోగం.. ఈ రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశిని, నక్షత్రాన్ని మార్చుకుంటాయి. ఇలా గ్రహాలు తమ స్థానం మార్చుకునే సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తాయి. త్వరలో నవ గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు.. దేవ గురువు బృహస్పతి తమ రాశులను మర్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల కలయికతో అర్ధ కేంద్ర యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు పట్టిందల్లా బంగారమే.

Jupiter Sun Transit: ఈ నెల 25న సూర్య గురుల కలయిక.. ఏర్పడనున్న అర్థకేంద్ర రాజ యోగం.. ఈ రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారమే..
Surya Brihaspati Yuti
Surya Kala
|

Updated on: Apr 22, 2025 | 9:06 AM

Share

వేద జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు, నక్షత్రాలకు విశిష్ట స్థానం ఉంది. వ్యక్తి జాతకం తొమ్మిది గ్రహాల స్థానంపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నవ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాయి. అదే సమయంలో నక్షత్రాన్ని కూడా మార్చుకుంటాయి. ఇలా నవగ్రహాలు తమ రాశులను మార్చుకునే సమయంలో మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తాయి. కొంతమందికి మంచి చేస్తే.. మరికొందరికి చెడు చేస్తాయి. ఇలా నవ గ్రహాలు తమ స్థానాలను మార్చుకునే సమయంలో.. ఈ ప్రభావం రాశులపై ఉండడమే కాదు.. శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు కొన్ని రాశులకు శుభాలను కలిగించగా.. మరికొన్ని రాశులకు కష్టాలు, నష్టాలు కలిగిస్తాయి. త్వరలో సూర్యుడు, బృహస్పతి తమ రాశులను మార్చుకోనున్నాడు.

దేవ గురువు బృహస్పతి సంవత్సరానికి ఒకసారి రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు నెలకు ఒకసారి రాశిని మార్చుకుంటాడు. ప్రస్తుతం సూర్యుడు మేష రాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే రెండు గ్రహాలు ఏప్రిల్ 25న ఒకే రాశిలో కలవనున్నాయి. ఈ గ్రహాల కదలికతో అర్థకేంద్ర రాజ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావంవల మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. సూర్య బృహస్పతి కలయికతో ఏర్పడే అర్ధకేంద్ర రాజ యోగం వల్ల అదృష్టాన్ని పొందే రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్య బృహస్పతి కలయికతో ఏర్పడే అర్ధకేంద్ర రాజ యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారికి శుభవార్త వినే అవకాశం ఉంది. జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: ఈ మిథున రాశి వారికి కూడా అర్థకేంద్ర రాజ యోగం వలన శుభ ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు తమ పనితీరుకు మంచి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులు పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు అర్ధకేంద్ర రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే అవుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలను అందుకుంటారు. ఆఫీసులో ఉద్యోగంలో చేసే పురోగతి కనిపిస్తుంది. జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడులతో మంచి లాభాలను అందుకుంటారు. అనేక విధాలుగా ఆదాయాన్ని ఆర్జిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు