AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Transit 2025: ఈ నెల 28న నక్షత్రాన్ని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ మూడు రాశుల వారు బంగారం పట్టుకున్నా మసే..

నవ గ్రహాల్లో శనీశ్వరుడు నక్షత్ర మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఎవరి జాతకంలోనైనా శనిశ్వరుడి స్థానం ఇప్పటికే బలహీనంగా లేదా ప్రతికూలంగా ఉంటే.. అప్పుడు కొన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఇలా శనిశ్వరుడి రాశులపై ప్రభావం చూపించాలంటే జాతకంలో ఇతర గ్రహాల స్థానం, పరిస్థితులు కూడా ముఖ్యమైనవి.

Saturn Transit 2025: ఈ నెల 28న నక్షత్రాన్ని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ మూడు రాశుల వారు బంగారం పట్టుకున్నా మసే..
Saturn Transit 2025
Surya Kala
|

Updated on: Apr 22, 2025 | 1:17 PM

Share

హిందూ మతంలో శనిశ్వరుడిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడు వ్యక్తి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే అతన్ని కర్మ ఫలదాత అని కూడా అంటారు. నేటి నుంచి సరిగ్గా 6 రోజుల తర్వాత శనీశ్వరుడు తన నక్షత్రాన్ని మర్చుకోనున్నాడు. వాస్తవానికి శనీశ్వరుడు అత్యంత నెమ్మదిగా కదులుతాడు. శనిదేవుడు ఈ నెలలో ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడు తన రాశి లేదా నక్షత్రరాశిని మార్చినప్పుడల్లా.. అది కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

శనీశ్వరుడు నక్షత్ర మార్పు ఎప్పుడంటే

శనిదేవుడు 6 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 28న నక్షత్రాన్ని మర్చుకోనున్నాడు. ఏప్రిల్ 28న ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రం శనీశ్వరుడు అధిపతి. ఈ మార్పు కొన్ని రాశులపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ రాశి మార్పు వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే మూడు రాశులు ఉన్నాయి. ఆ రాశులు ఏమిటంటే..

మేషరాశి: ఏప్రిల్ 28న శనీశ్వరుడు ఉత్తరభద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది మేష రాశి వారిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కనుక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. శనీశ్వరుడు నక్షత్ర మార్పు కారణంగా మేష రాశి వారు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కష్టాలు అకస్మాత్తుగా సంభవించవచ్చు. కొన్ని ప్రభుత్వ పనులలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే, ఖర్చులు కూడా పెరగవచ్చు. మేష రాశి వారు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీరు కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: శనీశ్వరుడు నక్షత్ర మార్పు మిథున రాశి గల వ్యక్తులపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. అనవసరమైన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పటికే పూర్తి చేసిన పని చెడిపోవచ్చు.

కుంభ రాశి: కుంభ రాశి వారు కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు జీవితంలో కొన్ని సమస్యలతో పాటు ఆర్ధిక ఇబ్బందులను ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

శనీశ్వరుడు సంచారము కొన్ని రాశులకు కూడా సానుకూల ఫలితాలను తెస్తుంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు పురోగతి, లాభం పొందే అవకాశాలు ఉండవచ్చు. కనుక శనీశ్వరుడు నక్షత్ర మార్పుకు భయపడాల్సిన అవసరం లేదు. ఏ రాశికి చెందిన వ్యక్తులపైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటే.. జాగ్రత్తగా ఉండండి. తగిన చర్యలు తీసుకోండి. జాతకాన్ని అనుసరిస్తూ శనీశ్వరుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు