AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయా.. ఆది శంకర మఠంలో నిర్వహించే చక్ర చండీ యాగంలో పాల్గొనండి.. పూర్తి వివరాలు మీ కోసం..

భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త ఆది శంకరాచార్యులు సమస్త మానవాళికి అందించిన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు దేశంలో ఆది శంకర మఠాలను స్థాపించి రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటువంటి ఆదిశంకర మఠం తెలంగాణలో కూడా ఒకటి ఉంది. ఇక్కడ రోజూ మాత్రమే కాదు పండగలు, పర్వదినాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు మే నెలలో చండీ యాగం కూడా నిర్వహించనున్నారు.

మీ జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయా.. ఆది శంకర మఠంలో నిర్వహించే చక్ర చండీ యాగంలో పాల్గొనండి.. పూర్తి వివరాలు మీ కోసం..
Kalady Sri Adi Shankara Madom (2)
Surya Kala
|

Updated on: Apr 22, 2025 | 12:14 PM

Share

ఇలలో నడిచిన దైవంగా ఖ్యాతిగాంచిన శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని,. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి శ్రీ ఆదిశంకర మఠం కృషి చేస్తోంది. శ్రీ ఆది శంకరాచార్యులు బోధించిన వేద సంప్రదాయాలను వివిధ కార్యక్రమాల ద్వారా అందించేందుకు ఆదిశంకర మఠం నిరంతరం కృషి చేస్తోంది. భావి తరాలకు అందిస్తోంది. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠం ఆదిశంకరాచార్యులు అందించిన దైవిక జ్ఞానం, తత్వాలను ప్రచారం చేస్తూ ప్రజలకు ఆధ్యాత్మికత గొప్పదనాని అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు వివిధ పూజాధికార్యక్రమాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మే నెలలో శ్రీ చక్ర చండీ యాగం చేయనున్నట్లు మఠం సిబ్బంది వెల్లడించింది.

సాధారణంగా గణపతి హోమం, అయుష్య హోమం, మృత్యుంజయ హోమం తదితరాలను ఎవరో ఒక దేవుడు లేదా దేవతను ఉద్దేశించి చేస్తారు. కానీ, చండీ యాగంలో మాత్రం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ముగ్గురికీ కలిపి పూజలు నిర్వహిస్తారు. ఈ చక్ర చండీ యాగం చండీ దేవిని పూజించి ఆశీర్వాదాలు పొందడానికి నిర్వహించే ఒక ఆచారం. ఇది అన్ని రకాల సమస్యలను తొలగించి, జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడానికి ఒక శక్తివంతమైన యాగం. ఈ యాగం చండీ సప్తశతిని పారాయణ చేసి.. హోమం నిర్వహిస్తారు.

ఇంట్లో లేదా కార్యాలయంలో శాంతి లేదా.. శత్రుత్వం లేదా నెగటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతున్నారా.. ఆర్థిక సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో మే 1 వ తేదీన నిర్వహించనున్న శ్రీ చక్ర చండీ యాగంలో పాల్గొనండి. శాంతి, రక్షణ, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం దైవ ఆశీర్వాదాలను పొందండి.

ఇవి కూడా చదవండి

ఈ చండీ యాగంలో ప్రత్యక్షంగా పాల్గొనాలనుకునే భక్తులు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో తక్కువ టికెట్లు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్ ను పొందిన భక్తులు త్రికాల పూజ అంటే మూడు సార్లు శ్రీచక్ర పూజతో పాటు చండీ యాగంలో పాల్గొనవచ్చు.

ఈ చండీ యాగంలో ప్రత్యక్షంగా హాజరుకాలేని భక్తులు ఆన్ లైన్ ద్వారా పాల్గొనవచ్చు. ఇందుకోసం ఫీజు. రూ. 600లు చెల్లించాలి. మీ పేరు సంకల్పం చేస్తారు. ప్రసాదం ఇంటికి పంపిస్తారు. ఇప్పటికే ఈ యాగంలో పాల్గొనేందుకు టికెట్ల బుకింగ్ ప్రారంభం అయింది.

ఈ పవిత్ర యాగం చాలా అరుదుగా నిర్వహించబడుతుంది.. ముఖ్యంగా వ్యక్తిగతంగా లేదా ఇంట్లో చేయలేరు కనుక పండితుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దివ్య అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకావాల్సిందిగా ఆలయ సిబ్బంది కోరుతున్నారు. ఇప్పుడు శ్రీ చక్ర చండీ యాగం బుక్ చేసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం కోసం 8350903080 కి కాల్ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!
నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు..
నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు..
మోదీ 3 దేశాల టూర్.. ఇండో-పసిఫిక్‌పైనే ప్రత్యేక దృష్టి
మోదీ 3 దేశాల టూర్.. ఇండో-పసిఫిక్‌పైనే ప్రత్యేక దృష్టి
నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!
నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం