AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: హరారేలో బుడ్డోడి అరాచకం.. ఈసారి 31 బంతుల్లో..

Vaibhav Sooryavanshi, IND vs ZIM 3rd T20I: భారత్, జింబాబ్వేల మధ్య జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. హరారేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, 10.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.

Vaibhav Sooryavanshi: హరారేలో బుడ్డోడి అరాచకం.. ఈసారి 31 బంతుల్లో..
Ind Vs Zim 3rd T20i Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Jul 26, 2026 | 5:18 PM

Share

Vaibhav Sooryavanshi: భారత్, జింబాబ్వేల మధ్య జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. హరారేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, 10.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.

వైభవ్ సూర్యవంశీ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి తన రెండవ టీ20 అంతర్జాతీయ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 29 పరుగులు చేసి పెవలియన్ చేరాడు. అభిషేక్ శర్మ (2 పరుగులు) రూపంలో భారత్ తన మొదటి వికెట్‌ను కోల్పోయింది. అతడిని బ్లెస్సింగ్ ముజరబాని ఔట్ చేశాడు. ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన భారత జట్టు, సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించింది.

ఇరుజట్ల ప్లేయింగ్-11

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ.

Follow Us