Kitchen Hacks: కుండలో నీరు తాగుతున్నారా.. ఎన్ని రోజులకు నీటిని మార్చాలి? ఎలా కుండని శుభ్రం చేయాలో తెలుసా..
వేసవి కాలం వస్తే చాలు చల్లదనం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది దాహం తీర్చుకోవడానికి చాలా మంది రిఫ్రిజిరేటర్లలోని నీరు త్రాగితే.. మరొకొందరు మట్టి కుండలలోని నీటిని తాగడానికి ఇష్టపడతారు. ఇది నీటిని సహజంగా చల్లబరుస్తుంది. అయితే కుండను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కుండను శుభ్రం చేసుకోడానికి కొన్ని చిట్కాలున్నాయి..

వేసవి కాలంలో చల్లటి నీటి కోసం కొంతమంది రిఫ్రిజిరేటర్‌లో బాటిళ్లను పెట్టి ఆ నీటిని తాగితే.. మరికొందరు మట్టి కుండల్లో నీరుని తాగడానికి ఇష్టపడతారు. ఈ రెండు నీటిని సహజంగా చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే కుండలో నీరు సహజంగా చల్లబడడమే కాదు.. అనేక విధాలుగా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా కూడా పరిగణించబడుతుంది. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది మట్టి కుండల్లోని నీళ్లు తాగుతున్నారు.
అదే సమయంలో మట్టి కుండలను కూడా సరిగ్గా శుభ్రపరచడం అవసరం. మట్టి కుండలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నీటిని మార్చాలి. ఎందుకంటే కుండలో నీరు నిల్వ ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ నీటిని తాగితే అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల,.. మట్టి కుండను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అయితే మట్టి కుండను కేవలం నీటితో కడగడం సరిపోదు. బదులుగా కొన్ని పద్ధతులతో మట్టి కుండను చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు,
నిమ్మకాయ సర్ప్: మట్టి కుండలను శుభ్రం చేయడానికి నిమ్మకాయ, సర్ఫ్‌ను ఉపయోగించవచ్చు. దీని కోసం సగం బకెట్ వేడి నీటిలో నిమ్మరసం, అర చెంచా సర్ఫ్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉన్న నీటిలో కుండని వేసి రుద్దండి. తర్వాత కుండని మంచి నీటితో శుభ్రం చేయండి.
బేకింగ్ సోడా, వెనిగర్: కుండని శుభ్రం చేసేందుకు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ ద్రావణాన్ని వేసి ఒక మిశ్రమం తయారు చేయండి. ఇప్పుడు స్క్రబ్బర్ సహాయంతో.. ఈ ద్రావణంతో కుండను రుద్ది శుభ్రం చేయండి. దీని తరువాత కుండను నీటితో శుభ్రంగా కడగాలి.
పటికతో శుభ్రం చేసుకోండి: మట్టి కుండలను కూడా పటికతో శుభ్రం చేయవచ్చు. దీని కోసం ముందుగా కుండను శుభ్రమైన నీటితో కడగాలి. దీని తరువాత కుండలో కొంచెం నీరు పెట్టి.. ఒక పటిక ముక్క వేసి కొంత సమయం అలాగే ఉంచండి. దీని తరువాత.. శుభ్రమైన బ్రష్ తీసుకొని దానిని రుద్ది కుండను శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టండి. దీని తరువాత కుండను మళ్ళీ నీటితో నింపి కొన్ని గంటలు అలాగే ఉంచండి. తరువాత ఈ నీటిని పారవేయండి.
కొత్త కుండని ఎలా శుభ్రం చేయాలంటే: మొదటిసారి కొత్త కుండను ఉపయోగించబోతున్నట్లయితే.. ముందుగా దానిని కనీసం 12 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి స్క్రబ్బర్‌తో శుభ్రం చేయండి. తరువాత సాధారణ నీటితో కడిగిన తర్వాత, దానిలో నీరు నింపండి. తర్వాత ఆ నీటిని పారవేసి.. మళ్ళీ శుభ్రం చేసుకుని కుండని అప్పుడు ఉపయోగించండి.
అంతేకాదు కుండను 6 నుంచి 7 నెలలు మాత్రమే ఉపయోగించండి. తర్వాత కుండను మార్చడం సరైనది. అలాగే కుండలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించవద్దు. కుండలో నీటిని ఎప్పటికప్పుడు నీటిని మారుస్తూ ఉండండి. రెండు మూడు రోజులకు కుండలో నీటిని మార్చవచ్చు. అలాగే కుండను కనీసం వారానికి ఒకసారి లేదా 7-10 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








