AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే

రాత్రి సమయంలో భోజనం చేయకపోతే, శరీరంలో జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. శరీరం ముందుగా తిన్న ఆహారాన్ని సరిగా జీర్ణించుకుంటుంది. శక్తిని పొందేందుకు శరీరానికి మంచి అవకాశం దక్కుతుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట ఎక్కువగా తింటే నిద్ర బాగా పట్టదు. ఎక్కువ తినడం వల్ల పొట్ట బరువుగా అనిపిస్తుంది. పైగా అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఇది నిద్రలో అంతరాయాన్ని కలిగిస్తుంది. 

ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
Night Meal Mistakes
Prashanthi V
|

Updated on: Apr 22, 2025 | 11:37 AM

Share

రాత్రి తినే ఆహారం తగ్గిస్తే.. నిద్ర నాణ్యతగా ఉంటుంది. సరిగ్గా నిద్రపోవటంతో శరీరం విశ్రాంతి పొందుతుంది. ఉదయం లేచినప్పుడు తేలికగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఫలితంగా రోజంతా ఎనర్జీగా ఉండవచ్చు. రాత్రి భోజనాన్ని తగ్గించడం వల్ల శరీరం లోపల ఉన్న కొవ్వును వేగంగా కరిగించడం ప్రారంభిస్తుంది. చేతులు, కాళ్లు, భుజాలు, కడుపు వంటి భాగాల్లో ఉన్న కొవ్వు తక్కువవుతుంది. ఈ విధంగా బరువు తగ్గడం సులభం అవుతుంది. శరీరం రోజంతా చురుకుగా పనిచేస్తూ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

రాత్రి సమయంలో అధిక ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి. అయితే రాత్రి భోజనం తగ్గించడం వల్ల ఈ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇవి శరీరానికి సహజంగా శక్తిని అందిస్తూ ఇన్సులిన్ విడుదలను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది.

రాత్రి తినడం వలన ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇవి శరీరంలో ఇబ్బందికరమైన మార్పులకు దారితీస్తాయి. అయితే రాత్రి భోజనం తగ్గించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. ఇది చక్కటి జీర్ణ వ్యవస్థను అందించడానికి సహాయపడుతుంది.

శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. అంటే శరీరం తక్కువ ఇన్సులిన్‌ తోనే శక్తిని సమర్థవంతంగా పొందుతుంది. దీని వలన శరీరానికి అవసరమైన శక్తి నిల్వలు తగ్గుతాయి ఇది ఆరోగ్యానికి మంచిది.

రాత్రి భోజనం తగ్గించడం వల్ల శరీరంలో ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. మీరు మంచి శక్తితో, ఫ్రెష్‌గా క్షేమంగా ఉంటారు. శరీరంలోని ఒత్తిడి, అలసట తగ్గించి ప్రతి పనిని చేయడానికి కొత్త శక్తిని అందిస్తుంది.

రాత్రి ఆహారం తీసుకోకపోతే శరీరం అదనపు కొవ్వును నిల్వ చేయకుండా అవసరమైన శక్తిని పొందడానికి ఫ్యాట్‌ను వేగంగా కాల్చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదనపు కొవ్వు నిల్వలు తగ్గుతాయి మరింత సన్నగా మారవచ్చు. రాత్రి తినడం మానేయడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఎలాంటి ఆందోళన లేకుండా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు.

రాత్రి సమయంలో ఆహారాన్ని తగ్గించడం వల్ల మీ శరీరంపై మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆహార నియంత్రణను పాటించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రాత్రి భోజనం తగ్గించడం వల్ల శరీరంలో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది. శరీరంలో హార్మోన్లు సహజంగా సమతుల్యంగా పనిచేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)