AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver Disease: ఆల్కహాలిక్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి.. రెండిటిలో ఏది ప్రమాదకరం.. నిపుణుల సలహా ఏమిటంటే..

బీపీ, షుగర్ వలెనే కొవ్వు కాలేయ వ్యాధి చాలా సాధారణమైపోయింది. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు దీని బాధితులు. ఫ్యాటీ లివర్ రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్.. మరొకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఈ రెండిటిలో ఏది ప్రమాదకరమైనదో నిపుణుల చెప్పిన సమాచారం గురించి ఈ రోజున తెలుసుకుందాం..

Fatty Liver Disease: ఆల్కహాలిక్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి.. రెండిటిలో ఏది ప్రమాదకరం.. నిపుణుల సలహా ఏమిటంటే..
Alcoholic Or Non Alcoholic Fatty Liver
Surya Kala
|

Updated on: Apr 22, 2025 | 11:35 AM

Share

ఫ్యాటీ లివర్ రెండు రకాలు. ఒకటి మద్యం సేవించడం వల్ల ఏర్పడేది. వైద్య పరిభాషలో దీనిని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ప్రజలు మద్యం తాగకపోయినా కాలేయం కొవ్వుగా మారితే.. దానిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఇవి రెండు రకాల కాలేయ వ్యాధులు. ఇవి ప్రారంభ దశలో సాధారణం. అయితే తరువాత ఇది కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. చాలా మంది మనసులో మద్యం సేవించడం వల్ల దెబ్బతింటున్న కాలేయం ప్రమాదకరమా లేదా చెడు ఆహారపు అలవాట్ల వల్ల దెబ్బతింటున్న కాలేయం ప్రమాదకరమా అనే ప్రశ్న కలుగుతుంది.

కాలేయంలో కొవ్వు నిర్దేశించిన ప్రమాణాన్ని మించిపోతే దానిని ఫ్యాటీ లివర్ వ్యాధి అని వైద్యులు అంటున్నారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే.. రెండు పరిస్థితులు ఏర్పడతాయి. కాలేయం వాపు, మచ్చలు (ఫైబ్రోసిస్), కాలేయం సిర్రోసిస్‌కు కూడా దారితీయవచ్చు. సిర్రోసిస్ తర్వాత పరిస్థితి తీవ్రమవుతుంది. కాలేయం దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో కాలేయం మార్పిడి కూడా అవసరం కావచ్చు.

గత దశాబ్దంలో భారతదేశంలో కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. కాలేయం విఫలమవుతోంది.. దీంతో కాలేయ మార్పిడి కోసం వేచి ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ప్రతి ఒక్కరూ ఆల్కహాలిక్ , నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవాలి. కాలేయం ఎందుకు ఫ్యాటీగా మారుతుంది? ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? రెండిటిలో ఏది ఎక్కువ ప్రమాదకరమైనదో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (AFLD)

అధికంగా మద్యం సేవించే వ్యక్తులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కారణం ఏమిటంటే మద్యం సేవించిన తర్వాత వీరి కాలేయం దానిని జీర్ణం చేసుకోవడానికి కష్టపడుతుంది. దీని కారణంగా కొవ్వు ఏర్పడటం మొదలవుతుంది. కాలేయ కణాలు దెబ్బతింటాయి. మద్యపానం కొనసాగితే AFLD త్వరగా ఆల్కహాలిక్ హెపటైటిస్, ఫైబ్రోసిస్ , చివరికి సిర్రోసిస్ లేదా కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం. ఇది మరణానికి కూడా కారణమవుతుంది.

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వలన కలిగే ప్రమాదాలు ఏమిటి?

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అధికంగా మద్యం సేవించడం వలన కలుగుతుంది.

పోషకాహార లోపాలు

హెపటైటిస్ బి లేదా సి వంటి ఇన్ఫెక్షన్లు

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFLD)

NAFLD కి ఆల్కహాల్ వినియోగంతో ఎటువంటి సంబంధం లేదు. బదులుగా ఇది ఈ కారణాల వల్ల ఏర్పడుతుంది

ఊబకాయం

టైప్ 2 డయాబెటిస్

అధిక కొలెస్ట్రాల్

రెండిటిలో ఏది ఎక్కువ ప్రమాదకరమైనది?

రెండూ ప్రమాదకరమని సికె బిర్లా హాస్పిటల్‌లోని జిఐ.. బేరియాట్రిక్ సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుఖ్‌విందర్ సింగ్ సగ్గు అంటున్నారు. ఇవి లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ .. మరణానికి కూడా కారణమవుతాయి. అయితే ఇప్పుడు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రమైనదిగా మారే వరకు ఎవరూ దానిపై దృష్టి పెట్టడం లేదు.

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను ముందుగానే నిర్ధారించడం కూడా కష్టం. అది నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది. అకస్మాత్తుగా తీవ్రమైన రూపాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మద్యం తాగకపోతే తన కాలేయం బాగానే ఉంటుందని అనుకుంటాడు.. అయితే ఆ ఊహ వాస్తవం కాదు. చెడు ఆహారపు అలవాట్లు కూడా ఆల్కహాల్ లాగానే కాలేయానికి హాని కలిగిస్తాయి.

మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా

ఎవరికైనా ఇప్పటికే కాలేయ సమస్యలు ఉంటే, మద్యం తాగడం తగ్గించండి. లేదా పూర్తిగా మద్యానికి దూరంగా ఉండండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్య కరమైన బరువుని నిర్వహించండి

పండ్లు, కూరగాయలు తినండి

శుద్ధి చేసిన పిండి ఎక్కువగా తినవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)