US Delta plane: డెల్టా విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. 282 మంది ప్రయాణికులు సురక్షితం..
అమెరికాలోని ఓర్లాండో విమానాశ్రయంలో పెను ప్రమదం తప్పింది. డెల్టా విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 282 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అత్యవసర స్లయిడ్‌లను ఉపయోగించి బయటకు సురక్షితంగా పంపబడ్డారు. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకదాని టెయిల్ పైప్‌లో మంటలు కనిపించిన వెంటనే.. డెల్టా విమాన సిబ్బంది స్పందించింది. ప్రయాణీకుల క్యాబిన్‌ను ఎమెర్జెన్సి ఎగ్జిట్ ద్వారా పంపించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.

అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. అయితే మంటల గురించి సమాచారం సకాలంలో అందడంతో.. విమానంలో ఉన్న 282 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. అత్యవసర స్లయిడ్‌ల ద్వారా ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా తరలించారు. మీడియా నివేదికల ప్రకారం సోమవారం (స్థానిక సమయం) ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం మంటల్లో చిక్కుకుంది. ఆ తర్వాత ప్రయాణికులను అత్యవసర స్లయిడ్‌ల ద్వారా తరలించాల్సి వచ్చింది.
A Delta flight just caught on fire at the Orlando Airport 😳 pic.twitter.com/kmksyx5QIu
ఇవి కూడా చదవండి— Dylan (@dylangwall) April 21, 2025
రెండు ఇంజిన్లలో ఒక ఇంజన్ కి మంటలు
అట్లాంటాకు వెళ్తున్న విమానం రన్‌వేపైకి టేకాఫ్ అయిన వెంటనే దాని రెండు ఇంజిన్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్.. డెల్టా ఎయిర్ లైన్స్ తెలిపాయి. కుడి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగిన ఈ సంఘటనపై FAA దర్యాప్తు ప్రారంభించింది. ఈ దృశ్యం టెర్మినల్‌లో ఉన్న ఒక ప్రయాణీకుడు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
ఆ విమానంలో 282 మంది ప్రయాణికులు
నివేదిక ప్రకారం ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకుల్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకదానిలో టెయిల్ పైప్‌లో మంటలు గమనించిన తక్షణమే డెల్టా విమాన సిబ్బంది స్పందించింది. ప్రయాణీకుల క్యాబిన్‌నుంచి ఎమెర్జెన్సి ఎగ్జిట్ ద్వారా సురక్షితంగా పంపించింది.
@Delta was on your ATL to MDW flight yesterday when the plane’s ceiling panel fell off and my row and the row ahead of me had to hold it up to stop it from crashing in to anyone (til it could be taped lol). Been my preferred airline for 15 years but +10,000 miles ain’t cutting it pic.twitter.com/NkYTGMQiYj
— LFI (@LocationFinders) April 15, 2025
ప్రయాణికుల సహకారానికి ప్రశంసలు
ఈ ఘటనపై స్పందించిన ఎయిర్లైన్ తమ ప్రయాణీకులు తమకు ఎంతగానో సహకరించారని.. ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ప్రయాణీకులకు ఎదురైన ఈ అనుభవానికి క్షమాపణలు కోరుతున్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రయాణీకుల భద్రత కంటే తమకు మరేమీ ముఖ్యం కాదని.. డెల్టా బృందాలు మా కస్టమర్లను వీలైనంత త్వరగా వారి తుది గమ్యస్థానానికి చేరుస్తాయని వెల్లడించింది. డెల్టా ఇతర విమానాల్లోని ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్తుందని ప్రకటించింది. అయితే నిర్వహణ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విమానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు మొదలు పెట్టింది.
@Delta was on your ATL to MDW flight yesterday when the plane’s ceiling panel fell off and my row and the row ahead of me had to hold it up to stop it from crashing in to anyone (til it could be taped lol). Been my preferred airline for 15 years but +10,000 miles ain’t cutting it pic.twitter.com/NkYTGMQiYj
— LFI (@LocationFinders) April 15, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




