Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఎందుకు శుభప్రదం? ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే ..
అక్షయ తృతీయ రోజు హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఏదైనా శుభకరమైన .. శుభప్రదమైన పని చేయడానికి చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనికి కారణం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. అక్షయ తృతీయ రోజును హిందువులు జరుపుకునే పవిత్రమైన తిధుల్లో ఒకటిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజు ఏ శుభ కార్యం చేయడానికైనా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వంటి లోహాలను కొనే సంప్రదాయం కూడా ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల సంపదలో సిరి సంపదలు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఎందుకు శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం, వెండితో పాటు ఇల్లు, వాహనం మొదలైన వాటిని కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే చాలా మంది మనసులో ఓ ప్రశ్న కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున ఇన్ని రకాలు వస్తువులు ఉండాగా.. బంగారం కొనడం ఎందుకు అంత పవిత్రమైనది? , దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?
హిందూ మతంలో బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నమ్మకం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది, దీని ప్రకారం దేవతలు.. రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసే సమయంలో.. లక్ష్మీదేవి తో పాటు అనేక విలువైన వస్తువులు బయల్పడ్డాయి. వాటిలో బంగారం కూడా ఒకటి. ఈ బంగారాన్ని శ్రీ మహా విష్ణువు ధరించాడు. ఈ కారణంగా దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించడం ప్రారంభించారు. అందుకే అక్షయ తృతీయ, ధంతేరస్ లలో బంగారం కొనే సంప్రదాయం ఉంది.
అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలు కొని ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. వాటితో పాటు లక్ష్మీ దేవి కూడా ఇంటికి వస్తుందని హిందువుల విశ్వాసం. అక్షయ తృతీయ రోజున మనం కొనుగోలు చేసిన సంపద లేదా ఆస్తి ఎప్పటికీ మనతోనే ఉంటుందని.. దానితో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజున ప్రజలు బంగారం కొంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








