AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడానికి, పూజించడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా..

సనాతన ధర్మంలో శివలింగాన్ని లయకారుడైన శివయ్యకు చిహ్నంగా భావిస్తారు. భోలాశంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు శివలింగాన్ని పూజిస్తారు. అదే సమయంలో..ఇంట్లో శివలింగాన్ని ఉంచడానికి వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు పేర్కొన్నాయి. వీటిని పాటింస్తూ శివుడిని ఇంట్లో పూజిస్తే.. శివయ్య అనుగ్రహం మీ సొంతం అవుతుంది.

Vastu Tips: ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడానికి, పూజించడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా..
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Apr 21, 2025 | 6:26 AM

Share

హిందూ మతంలో శివుడిని శివలింగ రూపంలో పూజిస్తారు. కొంతమంది శివలింగానికి జలంతో అభిషేకం చేస్తారు. మరికొందరు శివుని పట్ల తమకున్న భక్తి తెలుపుతూ పచ్చి పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఇంట్లో శివలింగాన్ని పూజించే విధానం.. ప్రతిష్టించే విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించబడ్డాయి. మీరు మీ ఇంటి పూజ గదిలో శివలింగాన్ని ప్రతిష్టిస్తే.. కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. ఇలా చేయడం వలన ఇంట్లోని సుఖ సంతోషాలు నెలకొని ఉంటాయి.

ఇంట్లో శివలింగాన్ని ఉంచడానికి నియమాలు

ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఆ శివలింగం పరిమాణం చిన్నగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెద్ద శివలింగాన్ని ఉంచడం శుభప్రదం కాదు. ఇంట్లో ఉంచే శివలింగం పరిమాణం బొటనవేలు పరిమాణం కంటే పెద్దదిగా ఉండకూడదు.

ఏ శివలింగం ఇంటిలో పెట్టుకోవడమ శుభప్రదం

వాస్తు ప్రకారం ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలనుకుంటే నర్మదా నదిలో లభించే రాతితో చేసిన శివలింగాన్ని మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలని చెబుతారు, ఎందుకంటే ఈ శివలింగం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో లోహంతో చేసిన శివలింగాన్ని ప్రతిష్టించాలనుకుంటే.. ఆ శివ లింగం బంగారం, వెండి లేదా రాగితో తయారు చేసినది అయి ఉండాలి. శివలింగం చుట్టూ పాము ఉండాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

ఒక ఇంట్లో ఎన్ని శివలింగాలను ఉంచుకోవచ్చు?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే శివలింగం శివునికి చిహ్నం.. శివుడు ఒక్కడే కనుక ఒకే ఇంట్లో వేర్వేరు శివలింగాలను ఉంచకూడదు.

శివలింగాన్ని ఎక్కడ ఉంచాలంటే

వాస్తు శాస్త్రంలో దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ చేసే సమయంలో భక్తుడి ముఖం తూర్పు వైపు.. శివలింగం పడమర వైపు ఉండే విధంగా శివలింగాన్ని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. శివలింగ పానవట్టం నీటి ప్రవాహం ఉత్తర దిశ వైపు ఉండాలి. అంతేకాదు మీరు శివలింగ పానవట్టం నీటి ప్రవాహాన్ని తూర్పు వైపు ఉంచవచ్చు.. అలాంటి సమయంలో శివయ్యకు పూజను ఉత్తర దిశకు ఎదురుగా చేయాల్సి ఉంటుంది.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

విరిగిన శివలింగాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇంట్లో విరిగిన శివలింగం ఉంటే.. దానిని ప్రవహిస్తున్న నదిలో కలిపి.. శివయ్యను క్షమాపణ కోరుకోవాలి. శివలింగాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై ఉంచవద్దు. దానిని స్టాండ్ మీద ఉంచాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు